బాలయ్య అభిమాని దాడి- గాయపడ్డ కళ్యాణ్ అభిమాని

Update: 2018-01-13 08:23 GMT

ఒకే సీజన్లో ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నప్పుడు ఆ పోటీ బాక్స్ ఆఫీస్ వద్ద కనిపిస్తే అది ఆరోగ్యకరమైన పోటీ గా అభివర్ణించొచ్చు. కానీ ఆయా హీరోల అభిమానుల మధ్య శారీరక దాడి తీసే ఘర్షణలు గా మారితే ఆ పోటీ ని ఏమని చెప్పగలం? ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సరిహద్దులలో ఒక థియేటర్ వద్ద జరిగింది. ఇచ్చాపురానికి ఒడిశా రాష్ట్రానికి పొలిమేరలలో వున్నా ఒక థియేటర్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన అజ్ఞ్యాతవాసి, జై సింహ చిత్రాల ప్రస్తావనతో మొదలైన సంభాషణ బాలయ్య అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని ల మధ్య మాటల యుద్ధంగా మారి చివరికి బ్లేడ్ లతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది.

బ్లేడ్లతో దాడి.....

అజ్ఞ్యాతవాసి చిత్ర ఫలితం ఏమిటో ఇప్పటికే జగం ఎరిగిన సత్యం కావటంతో థియేటర్ వద్ద జై సింహ తొలి ఆట ప్రదర్శన అనంతరం వస్తున్న యావరేజ్, అబోవ్ యావరేజ్ టాక్ లేక్ సంబరపడిపోయిన బాలయ్య అభిమానులు సంక్రాంతి సింహం బాలయ్యే అంటూ నినాదాలు చేస్తూ కళ్యాణ్ అభిమానులని రెచ్చగొట్టగా ఈ పరిణామం ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత ఘర్షణగా మారిపోయింది. ధనపాన హరిశ్చంద్ర అనే కళ్యాణ్ అభిమాని పై చాట్ల ఫకీరు అనే బాలయ్య అభిమాని బ్లేడ్ తో దాడి చేయగా కళ్యాణ్ అభిమానికి చెవి వెనుక భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించిన పోలీస్ లు, బాలయ్య అభిమానిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసే విషయమై ఆ ప్రాంతం ఒడిశా రాష్ట్ర పోలీస్ శాఖ పర్యవేక్షణలో వున్న కారణం చేత కేసు ని అక్కడికి బదిలీ చేశారు.

Similar News