బాయ్ ఫ్రెండ్ రూమర్స్ పై స్పందించిన భామ 

Update: 2017-02-19 08:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హీరోయిన్ అయిపోయిన శృతి హాసన్ ఇప్పుడు రెండవ సారి కాటమరాయుడు కోసం పవన్ కళ్యాణ్ కోసం జతకట్టిన విషయం తెలిసిందే. వచ్చే నెల ఆఖరుకి విడుదల కానున్న కాటమరాయుడు చిత్రంతో పాటు తమిళంలో తన తండ్రి కమల్ హాసన్ నటిస్తున్న శభాష్ నాయుడు, సంఘమిత్ర మరియు బాలీవుడ్ లో బెహెన్ హోగీ తేరి చిత్రంలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది శృతి హాసన్. బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి శృతి హాసన్ పై పలు రిలేషన్ షిప్స్ వార్తలు హల్చల్ చేస్తూనే వున్నాయి. అయితే తండ్రి మాదిరిగానే రూమర్స్ కి పెద్దగా రియాక్ట్ అవ్వని శృతి తొలిసారి తనపై వచ్చిన లేటెస్ట్ రిలేషన్ షిప్ వార్తలపై ఘాటుగానే స్పందించింది.

ప్రస్తుతం బాలీవడ్ లో చేస్తున్న బెహెన్ హోగీ తేరి చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ జరుగుతుండటంతో ఆ చిత్రానికి కమిటైన కాల్ షీట్స్ తోపాటు మద్రాస్ లో షూటింగ్ జరుగుతున్న తన తమిళ చిత్రాల షూటింగ్స్ ని సమన్వయ పరచుకుంటూ తరచు మద్రాస్-బొంబాయి ట్రావెల్ చేస్తోంది శృతి హాసన్. అయితే ఇటీవల బొంబాయి విమానాశ్రయంలో తన వెంటే లండన్ కి చెందిన నటుడు మైఖేల్ ఖోర్స్లే ఉండటంతో బాలీవుడ్ మీడియా అతగాడితో శృతి లివింగ్ రిలేషన్ లో ఉన్నట్టు పలు కథనాలు ప్రచురించింది. ఈ వార్తలపై స్పష్టత ఇచ్చేందుకు శృతి హాసన్ ఒక ఇంటర్వ్యూ లో తనకి ఎవరితోనూ రిలేషన్ షిప్ స్టేటస్ ఇంతవరకు జరగలేదని, మైఖేల్ ఖోర్స్లే కి తనకి మధ్య వున్నది కేవలం స్నేహ బంధమే అని, ఇష్టమొచ్చినట్టు రిలేషన్ సృష్టించి ప్రచారం చేసినంతమాత్రాన కొత్తగా తమ మధ్య ఏమి చిగురించదని కొంచం ఘాటుగానే స్పందించింది శృతి హాసన్. ఇప్పటి వరకు ఎందరితో రిలేషన్ షిప్ ఉందని వార్తలు వచ్చినా స్పందించని శృతి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ లేదని అరిచి మరీ ఎందుకు చెప్పినట్టో మరి.

Similar News