బాబోయ్ నయన్!!

Update: 2017-06-30 09:26 GMT

కోలీవడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార కు ఉన్న లవ్ ఎఫ్ఫైర్స్ మరెవ్వరికీ లేవు. ఆమె తీసుకునే పారితోషకం ఎంత సంచలనామో ఆమె రియల్ లైఫ్ ఎఫ్ఫైర్స్ కూడా అంతే సంచలనం. కోలీవుడ్ లో ముందుగా నయన్ శింబుతో ప్రేమాయణం నడిపింది. శింబు అయితే నయన్ తో ప్రేమలో పడిన తర్వాత కెరీర్ మొత్తం సంకనాకి పోయిందంటే చూడండి. ఏ రేంజ్ లో వీరి ప్రేమ వ్యవహారం నడిచిందో. అంతలా ప్రేమించుకున్నోళ్ళు ఎందుకు విడిపోయారో ఎవ్వరికి అర్ధం కాలేదు. కానీ శింబుమళ్ళీ కెరీర్ లో నిలదొక్కుకోలేకపోతున్నాడు

ఇక శింబు తర్వాత ప్రభుదేవాతో ప్రేమ కలాపాలు సాగించింది నయన్. ఇక ఆ వ్యవహారము అందరికి తెలిసిందే. భార్య రామాలత కి విడాకులిచ్చి నయన్ తో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందో నయన్ - ప్రభుదేవా విడిపోయారు. ఇక ప్రభుదేవా కెరీర్ కూడా బాలీవుడ్ లో అంతంత మాత్రం అయ్యింది. తాజాగా నయన్ డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమాయణం మొదలెట్టింది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కలిసి సహజీవం కూడా చేశారు. ఇంకేమిటి పెళ్లి చేసుకుంటారేమో అనుకుంటున్న సమయంలో వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలొచ్చాయి. అందుకే నయనతార, విగ్నేష్ ఇంటి నుండి హోటల్ కి వచ్చేసిందని అన్నారు.

కానీ ఇప్పుడు తాజాగా నయన్, విగ్నేష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక వీళ్ళ ఆమూడేళ్ల లవ్ అలాగే ఉందని త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్నీ మీడియా మిత్రులు విగ్నేష్ ని అడగ్గా ప్రస్తుతం ఇద్దరం కెరీర్ లో బిజీగా వున్నాం... అయినా మా పెళ్ళికి అప్పుడే తొందరేం వచ్చిందని మాట దాటేశాడు. మరి నిజంగా వీరు పెళ్లి చేసుకుంటారా లేకపోతె నయన్ పాత వ్యవహారాల్లాగే ఇది కూడా అనేది మాత్రం ఫుల్ సస్పెన్సు అంటున్నారు.

Similar News