బాబీని చూస్తే జాలేస్తుంది!!

Update: 2017-09-28 07:00 GMT

టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే.... ఆ సినిమాలో నటించిన హీరో... ఆ సినిమా నిర్మాత‌తో పాటే హీరోయిన్ అలాగే..... దర్శకుడు కూడా లాభపడతాడు. కానీ మొన్న సెప్టెంబర్ 21 న విడుదలైన జై లవ కుశ విషయం లో మాత్రం అది జరగలేదు. జై లవ కుశ బాక్స్ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతున్నా గానీ ఎక్కడ ఎవ్వరు డైరెక్టర్ బాబీ గురించి అస్సలు మాట్లాడటం లేదు. సినిమా అంతా ఎన్టీఆర్ మూడు పాత్రల్లో ఇర‌గ‌దీశాడ‌ని..... అలాగే ఎన్టీఆర్ జై పాత్రని అద్భుతంగా పండించాడ‌ని.... త‌న ఖాతాలో మ‌రో హిట్ అని అందరు ఎన్టీఆర్ నే పొగిడేస్తున్నారు.

డైరెక్టర్ మాట ఎక్కడ?

కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బాబి ద‌ర్శక‌త్వ ప్రతిభ‌ గురించి మాట్లాడినవాళ్ళు లేరు. నిజానికి క‌థ విష‌యంలో బాబీని ఎవ్వరూ పెద్దగా విమ‌ర్శించ‌డం లేదు గానీ ఈ క‌థ‌ని ఇంకా బాగా తీయాల్సింద‌ని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రలు బ‌లంగా ఉన్నా.... వాటిని కావ‌ల్సిన స్థాయిలో బాబీ ఎలివేట్ చేయ‌లేక‌పోయాడ‌ని విశ్లేష‌కులు తేల్చేశారు. పైగా ఇంకా కథా, కథనంలో లోపాలు వెతికారు విమర్శకులు. ఇదిలా ఉంటే బాబీ గత చిత్రం అయిన సర్దార్ గబ్బర్ సింగ్ విషయం లోనూ ఇదే జరిగింది. సర్దార్ సినిమా బాక్సాఫీసు దగ్గర సక్సెస్ కాలేపోయినా గాని ప్రమోషన్స్ లో మాత్రం బాబీ పేరు ఎక్కడా వినబడలేదు.

సర్దార్ విష‍యంలో.....

ఎందుకంటే సర్దార్ సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ క్రేజ్ మీద నడిచింది. ఆ సినిమా ప్లాప్ అయిన విషయంలోనూ అందరూ పవన్ కళ్యాణ్ నే అన్నారు గాని ఎవరు బాబీ ని విమర్శించలేదు. పాపం ప్లాప్ అయినా సినిమాకి తన పేరు నిబడకపోయినా... బాధపడని బాబీ ఇప్పుడు జై లవ కుశ విజయంలో తనకు సరైన గుర్తింపు రాకపోవడం పట్ల బాబీ డల్ అయినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

Similar News