బయోపిక్ లో కళ్యాణ్ రామ్ ఫిక్స్

Update: 2018-04-10 08:54 GMT

గత కొంత కాలం నుండి టాలీవుడ్ గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారంటే మాములు విషయం కాదు. మనం తీసిన సినిమాలని మెచ్చుకోవటమే కాదు రీమేక్ కూడా చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో వాళ్లు... వాళ్లు తలుచుకుంటే ఏ సినిమా ఐన తీయగలరు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నందమూరి తారకరామారావు గారి బయోపిక్ గురించి కూడా దేశవ్యాప్తంగా అలానే మాట్లాడుకుంటున్నారు.

ఎన్టీఆర్ జీవితం గురించి దేశం మొత్తం తెలుసు. ఎందుకంటె అయన నట జీవితం కానీ.. పొలిటికల్ జీవితం కానీ అందరిని అంతలా ప్రభావం చేసింది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన సంఘటనలు గురించి అందరికి తెలిసిందే. మరి ఈ బయోపిక్ లో బాలకృష్ణ తన వియ్యంకుడు చంద్రబాబును పాత్ర ఎలా చూపిస్తారో అనేది అసలు అంశం. అందరు ఆ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ హరి కృష్ణ పాత్రకి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ సీఎం అవ్వకముందు హరికృష్ణ తన ఆలోచనలతో పార్టీను ముందుకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా చైతన్య రథంను నడిపి ఎన్టీఆర్ కు తోడుగా ఉండి సక్సెస్ అయ్యాడు హరి కృష్ణ. అందుకే ఆ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఫిక్స్ చేశాడంట డైరెక్టర్ తేజ. దీనికి బాలకృష్ణ కూడా ఒకే చెప్పాడంట. ఇక నారా రోహిత్ - తారక రత్న కూడా సినిమాలో ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్ లో ఉంది.

Similar News