బయట కూడా బాగానే ఎంజాయ్ చేస్తాడు!!

Update: 2017-06-09 08:25 GMT

జూనియర్ ఎన్టీఆర్ కి లక్ష్మి ప్రణతితో పెళ్ళైనప్పటినుండి ఇప్పటివరకు ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి ప్రవేట్ పార్టీలకు గట్రా హాజరయినట్టు మీడియాలో ఎప్పుడూ ప్రచారం కాలేదు. ఏదో ఎన్టీఆర్ సినిమాల ఆడియో వేడుకలకి, ఎవరన్నా పెళ్లిళ్లకు పిలిస్తే తప్ప ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిని పెద్దగా బయటికి తీసుకురాడు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో కలిసి ప్రణతి కూడా ఒక బర్త్ డే పార్టీలో కలిసి బాగా ఎంజాయ్ చేసింది. టాలీవుడ్ లో ఒక బడా నిర్మాత కూతురు బర్త్ డే పార్టీకి ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో పాటే కొంతమంది ఫ్రెండ్ తో జాయిన్ అయ్యాడు.

ఇక ఈ బర్త్ డే పార్టీకి నారా రోహిత్, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్, డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు కె.ప్రకాష్, నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు కూడా పాల్గొన్నారట. మరి ఎన్టీఆర్ ప్రణతితో కలిసి లేట్ నైట్ వరకు ఈ పార్టీలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Similar News