బన్నీ కూడా బాలీవుడ్ కే..!!

నాలుగైదు సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ.. అప్పుడే బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. రెండో సినిమాకే భారీ క్రేజ్ వచ్చిన విజయ్ దేవరకొండ.. నాలుగైదు సినిమాల [more]

Update: 2020-02-05 07:29 GMT

నాలుగైదు సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ.. అప్పుడే బాలీవుడ్ లో స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. రెండో సినిమాకే భారీ క్రేజ్ వచ్చిన విజయ్ దేవరకొండ.. నాలుగైదు సినిమాల తర్వాత బాలీవుడ్ లో కి దిగేస్తున్నాడు. కానీ మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటోళ్ళు మాత్రం బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం RRR సినిమాతో బాలీవుడ్ కెలుతున్నాడు. ప్రభాస్ బాహుబలి, సాహో తో దిగాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ మీద మోజు పడుతున్నట్లుగా కనబడుతుంది.

ఇప్పటికే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా గల్లీ బాయ్ లాంటి సినిమాలుతో బాలీవుడ్ కి అడుగుపెడితే బావుంటుంది అని అల్లు అర్జున్ ఇప్పుడు ఆదిశగా ఆలోచిస్తున్నట్లుగా కనబడుతుంది. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ సినిమాని హిందీ సాటిలైట్ కొన్నవాళ్ళు డబ్బింగ్ చేయబోతున్నట్లుగా చెప్పడమే కాదు… ఇకమీదట తన నుండి వచ్చే సినిమాలన్నీ పలు భాషల్లో డబ్ చేస్తా అని చెబుతున్నాడు. అంతేకాదు.. హిందీలో సినిమా చెయ్యాలనే కోరికని బయటపెట్టాడు. మంచి డైరెక్టర్, అలాగే నిర్మాత సెట్ అయితే… కంటెంట్ ఉన్న కథతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తా అంటున్నాడు. తనకి బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరానీగారితో వర్క్ చేయాలని ఉందని అలాగే సంజయ్ లీలా భన్సాలీ, ఆనంద్ ఎల్ రాయ్ లాంటి డైరెక్టర్స్ స్టయిల్స్ నచ్చుతాయని అంటున్నాడు. మరి ఈలెక్కన అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ ట్రయల్స్ లోనే ఉన్నాడనిపిస్తుంది.

Tags:    

Similar News