బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్

Update: 2017-01-18 06:02 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా వుండే వారు చాలా తక్కువ మంది. పవన్ కళ్యాణ్ తో చనువు పెరిగే స్నేహ బంధం ఏర్పడటం అందరితోటి జరిగే పని కాదు. కానీ పవన్ కళ్యాణ్ కి పరిశ్రమ వర్గాలలో వున్నా కొద్ది మంది స్నేహితులు మాత్రం ప్రాణ స్నేహితులే. వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి నిర్మాణంలోకి దిగి పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మొదలు పెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలే. ఈ ఏడు సంవత్సరాలలో ఎనిమిది చిత్రాలు నిర్మించాడు బండ్ల గణేష్. నిర్మాతగా మారిన రెండవ చిత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయగలగటానికి పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం సమయం నుంచి వున్న సాన్నిహిత్యమే కారణమని పలుమార్లు వెల్లడించిన బండ్ల గణేష్ తనకి పవన్ కళ్యాణ్ దేవుడని కూడా తాను పవర్ స్టార్ తో నిర్మించిన తీన్మార్, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలలో భావోద్వేగానికి గురైన సంఘటనలు ఎవరు మర్చిపోలేరు. మరో వైపు బండ్ల గణేష్ స్పీచ్ ని ఎంజాయ్ చేసినంతగా మరెవరి స్పీచ్ ని ఎంజాయ్ చేయరు పవన్ కళ్యాణ్.

పరమేశ్వరా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో 2015 లో వచ్చిన టెంపర్ తరువాత మరొక చిత్రం రాలేదు. ఇప్పటి వరకు బండ్ల గణేష్ నిర్మాతగా ఇంత గ్యాప్ తీసుకోవటం ఇదే తొలి సారి. తాజాగా బండ్ల గణేష్ పవర్ స్టార్ ని కలవటం, పవన్ కళ్యాణ్ కార్యాలయం లో ఇద్దరు కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ 'బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్' అని ట్వీట్ చేయటంతో వీళ్ళ కాంబినేషన్ లో మూడవ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారా అనే సందేహాలు వస్తుండగా, ఇప్పటికే కాటమరాయుడు చిత్రీకరణ పూర్తవ్వకముందే ఎ.ఎం.రత్నం, ఎస్.రాధా కృష్ణ(చిన్న బాబు) లకు తన తదుపరి ప్రాజెక్ట్స్ ని సైన్ చేసిన పవర్ స్టార్ 2018 కి కానీ ఇతర నిర్మాత చిత్రాన్ని పట్టాలెక్కించలేడు. ఇప్పటికే రెండు సంవత్సరాలు సినిమా తీయని బండ్ల గణేష్ తన దేవుడి కోసం మరో ఏడాది ఎదురు చూస్తాడా? లేక గతంలో పవర్ స్టార్ తో ఉన్నట్టు సత్సబంధాలు బండ్ల గణేష్-పవన్ కళ్యాణ్ కి మధ్య కొనసాగటం లేదని మీడియా లో వచ్చిన కథనాలపై స్పందనగా తాను తిరిగి పవర్ స్టార్ ని కలిశానని చెప్పే ఉద్దేశంతో 'బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్' అని వ్యక్తపరిచాడా అని పలు రకాల చర్చలు జోరందుకున్నాయి.

Similar News