`ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్‌` స్టోరీ లైన్ ఇదే?

Update: 2018-08-12 06:05 GMT

విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఫ‌న్ అండ్ ఫ‌స్ట్రేష‌న్‌' అనే టైటిల్ పెట్టారు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యిన ఈ సినిమా కథ ఏంటో ఇప్పటివరకు ఒక్క క్లూ కూడా రాలేదు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఏంటో ఓ క్లూ దొరికింది.

ఇది భార్యా బాధితుల టైపు క‌థ అని తెలుస్తోంది. భర్తలు వారి భార్యల తీరుపై విసుగొచ్చి.. ఫ‌స్ట్రేష‌న్ ఎక్కువైపోయి ఫన్ కోసం బ్యాంకాక్ వెళ్తారట. ఈ నేపథ్యంలో కథ సాగిది. ఏంటి ఈ స్టోరీ వింటుంటే మీకు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా 'పెళ్లాం ఊరెళితే' గుర్తుకు వస్తుందా? పూర్తిగా ఆ స్టోరీ కాకపోయినా ఇంచుమించు అలానే ఉంటుందంటున్నారు.

భార్య.. భర్తలు మధ్య చిన్నచిన్న చిలిపి త‌గాదాలు,అనుమానాలు,కోప‌తాపాలు.. ఇవన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారట. డైరెక్టర్ అనిల్ సినిమాలంటే కామెడీకి పెట్టింది పేరు. ఇతని సినిమాల్లో కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు. ఇందులో కూడా వెంకటేష్.. వరుణ్ తేజ్ లతో కామెడీ చేయించి ఇరగతీసేశారని తెలుస్తుంది. వెంకీ నుండి పూర్తి స్థాయి వినోదాత్మ‌క సినిమా వచ్చి చాలాకాల‌మైంది. సో.. ఈసారి వెంకీ నుంచి కావాల్సిన వినోదాన్ని పిండుకోవొచ్చ‌న్న‌మాట‌. ఇక ఇందులో వెంకీ, వ‌రుణ్ తోడ‌ల్లుళ్ల‌గా నటిస్తుండగా..త‌మ‌న్నా,మెహ్రీన్ హీరోయిన్స్ గా క‌నిపించ‌బోతున్నారు.

Similar News