ఫైనల్ గా సంతృప్తి చెందాడట!!

Update: 2017-11-17 13:00 GMT

ఎంతో ప్రతిష్ఠతంగా తెరకెక్కిన్తున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 6న మొదలుకానుంది. ఈ సినిమాకి కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా దేశవ్యాప్త గుర్తింపు సాధించాలని తహ తహ లాడుతున్న చిరుకి ఒక సందేహం కలిగిందట. అదేమిటంటే.. సురేందర్ రెడ్డి కమర్షియల్ డైరెక్టర్ కదా. మరి ఈ సైరా చిత్రమేమో చారిత్రాత్మక చిత్రం... కాబట్టి సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చెయ్యగలడు? అని చిరుతో పాటు అందరిలోను ఈ అనుమానం ముందునుండే ఉంది.

టెస్ట్ షూట్....

అందుకే తాజాగా చిరు ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా తన కెరీర్ లో టెస్ట్ షూట్ లో పాల్గొననున్నాడు. చిరు రెండు రోజుల పాటు డైరెక్టర్ చేత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించాడట. ఇక తాను కూడా ఆ పాత్రకి తగట్టు కాస్ట్యూమ్ తో షూట్ లో పాల్గొని ఒకసారి తన లుక్ ని అంతా చెక్ చేసుకున్నాడట చిరు. మొత్తానికి సురేందర్ రెడ్డి వర్క్ మరియు తన కాన్ఫిడెన్స్ ని చూసి చిరు సంతృప్తి చెందారనే టాక్ వినబడుతుంది.

షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్...

ఇక దైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అని నిర్ణయంచుకున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి, కోలీవుడ్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ రెడీ అవుతుంది.

Similar News