ఫైనల్ గా అదే సెట్ అవుతుందేమో?

Update: 2017-10-04 06:39 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా మొదలైనప్పటినుండి పవన్ సినిమా టైటిల్ ఇదే అంటూ... ఇంజినీర్ బాబు, గోకుల కృష్ణుడు ఇలా రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అవన్నీ ఇపుడు వినబడడంలేదు గాని...ఇపుడు మాత్రం అజ్ఞాతవాసి అనే టైటిల్ మాత్రమే ప్రచారం లో ఉంది. మొన్న వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ తో అలాగే సాంగ్ బిట్ తో పవన్ సినిమా టైటిల్ అజ్ఞాతవాసిగానే ఫిక్స్ అయ్యారు పవన్ అభిమానులు... సదరు ప్రేక్షకులు కూడా. అయితే పవన్ కళ్యాణ్ టైటిల్ ని మొన్న దసరాకి ప్రకటిస్తారని కూడా ప్రచారం జోరుగా జరిగింది. కానీ దసరాకు కూడా పవన్ కల్యాణ్ అభిమానులకు చేదు అనుభవమే మిగిలింది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ఈమధ్యన అనుకున్న అజ్ఞాతవాసి అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.ఈ టైటిల్ వినడానికి, చెప్పుకోడానికి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ కచ్చితంగా వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్ర బృందం. అయితే పవన్ గత సినిమా అత్తారింటికి దారేది అనే టైటిల్ చెప్పుకున్నప్పుడు కూడా ఇలానే మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఫైనల్ గా అదే టైటిల్ సూపర్ హిట్ అయింది. మరి దీన్నిబట్టి ఇప్పుడు కూడా అజ్ఞాత వాసి కూడా అదే టైపులో క్లిక్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.

అతిత్వరలోనే ఈ అజ్ఞాతవాసి టైటిల్ ను విడుదల చేసి... దీపావళికి ఫస్ట్ లుక్ తీసుకురావాలనే యోచనలో త్రివిక్రమ్ అండ టీమ్ వుంది. పవన్ కల్యాణ్ సరసన అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

Similar News