ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది!!

Update: 2018-06-30 07:21 GMT

బాలీవుడ్ లో నిన్న శుక్రవారం విడుదలైన సంజయ్ దత్ బయోపిక్ సంజు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన మొదటి షోకే హిట్ టాక్ తెచ్చుకున్న సంజు సినిమా మొదటి రోజు అదరగొట్టే కలెక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరక్కేక్కిన సంజు సినిమాలో రణ్ బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో అదరగొట్టే పెరఫార్మెన్స్ తో కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్సు ఇచ్చాడు. జీవితంలో అనుకోకుండా ఎదురైన అడ్డంకులు తనను పాతాళానికి తొక్కేసినప్పుడు నలిగిపోయే పాత్రలో జాతీయ అవార్డు రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో కళ్ళు చెమర్చే రీతిలో సంజయ్ దత్ ఇంత దయనీయ స్థితిని చూసారా? అని అనిపించేలా లైఫ్ ఇచ్చాడు. మూడు దశల్లో కనిపించే సంజయ్ దత్ ప్రస్థానానికి తగ్గట్టు మూడు దశల్లో తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరుకు హాట్స్ ఆఫ్ చెప్పడం తక్కువే. ఈ సినిమాలో కేవలం ఐదారు పాత్రలు చుట్టూనే తిరిగినా సినిమాకి మాత్రం అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకి బెస్ట్ గా రణ్ బీర్ కపూర్ నటన, పరేశ్ రావల్ నటనతో పాటుగా... మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్ అన్ని హెల్ప్ అయ్యాయి. ఇక ఈ సినిమా హైయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

1 .సంజు - 32.50 కోట్లు

2. అవెంజర్ ఇన్ఫినిటీ వార్ - 31.50 కోట్లు

3. రేస్ 3 - 28.50 కోట్లు

4. బాఘీ 2 - 25.10 కోట్లు

5. పద్మావత్ - 19.00 కోట్లు

Similar News