ప్లాప్ హీరోస్ కి ముగ్గురు హీరోయిన్స్ కావాలంట

Update: 2018-01-01 09:02 GMT

మీడియం రేంజ్ హీరోస్ కి హీరోయిన్స్ దొరకటమే కష్టం. పైగా ముగ్గురు హీరోయిన్స్ కావాలంట. అది కూడా కెరీర్ ఒడిదుడుకుల్లో వున్న ఇద్దరు హీరోల కోసం హీరోయిన్స్ వేటలో ఉన్నాడంట డైరెక్టర్. సుడిగాడు లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు భీమినేని ఈ సినిమాకు డైరెక్టర్.

ఇది ఒక మంచి తమిళ్ సినిమా రీమేక్ అంట. ఈ సినిమాలో అల్లరి నరేష్, సునీల్ హీరోస్. సునీల్ కోసం ఇద్దరు హీరోయిన్స్... అల్లరి నరేష్ కోసం ఒక్కరు కావాలంట. టోటల్ గా ముగ్గురు కావాలంట పోనీ ఈ పాత్రలు.. ఆలా సాంగ్స్ లో.. కొన్ని సీన్స్ లో.. వచ్చి పోయే పాత్రలు కూడా కాదంట. కాస్త పెర్ ఫార్మెన్స్ కు చోటున్న పాత్రలంట.

మరి ఒక్కేసారి ముగ్గురు హీరోయిన్స్ అంటే దొరకడం కష్టమే. అందులో వీరు ఫామ్ లో లేరు. మరి వీరి పక్కన నటించటానికి ఎవరు ముందుకు వస్తారో... సినిమా తీయడం కన్నా దర్శకుడు భీమినేనికి ఇదే కష్టమైన టాస్క్ ఏమో?

Similar News