ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇంకేం కావాలి? ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ్

Update: 2017-02-04 02:01 GMT

ఈ నెల 10 వ తేదీన విడుదల కానున్న ఓం నమో వెంకటేశాయ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్న కథానాయకుడు అక్కినేని నాగార్జున దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆయన చేసిన ఈ చిత్ర విశేషాలతో పాటు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన భక్తి రస చిత్రాల గురించి కూడా కొంచం ఘాటుగా స్పందించారు. ఈ జోనర్ సినిమాలలో వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు తెరకెక్కగా అన్నమయ్య సంచలన విజయాన్ని, శ్రీ రామ దాసు మోస్తరు ఫలితాన్ని ఇవ్వగా షిరిడి సాయి మిశ్రమ ఫలితాలని ఇచ్చాయి.

షిరిడి సాయి మిగిల్చిన చేదు అనుభవాల గురించి స్పందిస్తూ అక్కినేని నాగార్జున, "షిరిడి సాయి ని మేము ఒక సినిమా కథలా చెప్పే ప్రయత్నం చేయకుండా డాక్యుమెంటరీ లా తెరకెక్కించాం. ఆ చిత్రం వైఫల్యం చెందటానికి బహుశా అదే కారణం ఐయి ఉండొచ్చు. అయితే షిరిడి సాయి చిత్రాన్ని విశ్లేషిస్తూ మూవీ క్రిటిక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ పాటించకుండా సినిమా తీశారు అని అభిప్రాయ పడ్డారు. అటువంటి అర్థరహితమైన విమర్శలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. షిరిడి సాయి ఎటువంటి దుస్తులు వాడారో అటువంటివో కాస్ట్యూమ్స్ మాత్రమే వాడాం. అప్పటి ఆయన నివాస పరిస్థుతలను సెట్స్ ద్వారా రీ క్రియేట్ చేసాం. షిరిడి సాయి చిత్రంలో కూడా హీరోయిన్ తో నాలుగు డ్యూయెట్స్ వేసి ఉంటే ప్రొడక్షన్ వాల్యూస్ మైంటైన్ చేసినట్టు అర్థమా?" అంటూ విమర్శకుల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసాడు నాగ్. షిరిడి సాయి కథ నెర్రెషన్ లో జరిగిన పొరపాటు ఓం నమో వెంకటేశాయ లో జరగకుండా డాక్యుమెంటరీ ఛాయలు తాకకుండా జాగ్రత్త పడ్డామని చెప్పారు నాగార్జున.

Similar News