ప్రేమలో వీర విహారం చేస్తున్న అనుష్క

Update: 2017-02-03 18:04 GMT

సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ తమ ప్రేమ వ్యవహారం బైటపడేంత వరకే అవి పుకార్లని కొట్టి పడేస్తుంటారు. ఒక సారి ప్రేమ వ్యవహారం బహిర్గతం అయిపోయిన తరువాత ఇక వారి స్వేచ్ఛకి హద్దు అదుపు ఉండదు. టాలీవుడ్ లో నాగ చైతన్య-సమంత లకైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మకైనా ఇదే పరిస్థితి. అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లీ తో కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో వున్న అనుష్క శర్మ ప్రైవేట్ టైం లో కోహ్లీతో కలిసి షికార్లు చేస్తున్నప్పుడు మీడియా కెమెరాలకు చిక్కకుండా ముఖం తిప్పుకున్న సందర్భాలను దాటుకుని వచ్చేసి విరాట్ కోహ్లీ తో ప్రేమ వ్యవహారం పై ఓపెన్ అయిపోయాక చాలా బోల్డ్ గా తన ప్రియుడిపై ప్రేమని బహిర్గతంగా పంచుకుంటుంది అనుష్క శర్మ.

కెరీర్ పరంగా సుల్తాన్, హే దిల్ హై ముష్కిల్ చిత్రాల బ్లాక్ బస్టర్స్ తో పీక్ పిరియడ్ లో వున్న అనుష్క శర్మ హలో మ్యాగజాయిన్ కోసం చేసిన ఫోటో షూట్ లో తన శరీర చాయకి దగ్గరగా వుండే దుస్తులు, ఆభరణాలు ధరించి డీప్ క్లివేజ్ తో తళ్లుకున్న మెరిసి అట్ట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫోటో లో అనుష్క శర్మ మేడలో వేలాడుతున్న లాకెట్ గురించే ఇప్పుడు అసలు చర్చ అంతా. 'V ' అక్షరాన్ని లాకెట్ గా మేడలో తగిలించుకుని కనిపించిన అనుష్క శర్మ ని ఆ V కి అర్ధం ఏంటి అని ఎవరైనా ప్రశ్నించాల్సిన అవసరం ఇక పై లేదు కూడా కదా.. అందరికి ఆ V విరాట్ కోహ్లీ కి సంకేతం అని తెలుసు కాబట్టి ఎవరూ ప్రశ్నించరు అని ఫిక్స్ అయిపోయిన అనుష్క శర్మ తన ప్రేమ లోని స్వేచ్ఛ ని బాగా ఆస్వాదిస్తునట్టుంది.

Similar News