ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నంతవరకు నటిస్తుంటా

Update: 2017-01-21 22:30 GMT

నట జీవితానికి విరామం ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి గత ఏడాది వరకు మెగా స్టార్ చిరంజీవికి ఆశించిన స్థాయి ఫలితాలు దక్కలేదు. కేంద్ర మంత్రిగా, రాజ్య సభ సభ్యుడిగా వ్యవహరించినప్పటికీ ఆ పదవులు అధీష్టించటానికి కారణమైన పరిణామాలు చిరంజీవి అభిమానులకు మింగుడు పాడనీ చేదు జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. సినిమా ప్రపంచంలో ఉన్నంత కాలం అగ్ర స్థానంలో వున్న చిరంజీవిని ఆయన అభిమానులు రాజకీయాలలోనూ అదే స్థానంలో వుండాలని ఆశించారు. అక్కడ చిరంజీవికి గడ్డు పరిస్థితి ఎదురు కావటంతో ఆయనకీ వున్న గుడ్ విల్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఒక్క సారి ఆయన తిరిగి వెండి తెర పై ప్రత్యక్షమవ్వగానే ఆయనదే నెం.1 స్థానం అని తేలిపోయింది. ఖైదీ నెం.150 చిరుకి సినిమా రంగంలో తన సుస్థిర స్థానాన్ని వేరెవరూ కైవసం చేసుకోలేరని స్పష్టం చేసింది.

చిరు రీ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ కావటంతో మెగా అభిమానులలో నూతనోత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహాన్ని తన తదుపరి చిత్రాలకు కూడా ఉండేలా మెగా అభిమానులను ఉద్దేశించి చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. "150 చిత్రాలతో నా నట జీవితం ముగిసిపోదు. ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నంత కాలం నటిస్తుంటా. గతంలో ఫిట్ గా వుంటూ ఫైట్స్, డాన్స్ చేయటమే కాదు కథ డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ కూడా ప్రయత్నిస్తాను. కొద్దిగా కష్టపడితే సిక్స్ ప్యాక్ ఏమీ అసాధ్యమైన పని కాదు. నా వద్దకు వచ్చే కథ నచ్చితే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయటానికి సిద్ధంగా వున్నా. బడ్జెట్ నిబంధనలు కూడా సడలించి కథలకి ప్రాధాన్యత ఇస్తూ నా తదుపరి చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా ఉండేలా అభిమానులు గర్వ పడేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను." అంటూ చిరంజీవి తన ఫిసికల్ ఫిట్నెస్ పై ఎటువంటి అపోహలకు తావివ్వకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

Similar News