ప్రియాంక చోప్రాతో వదంతులని కొట్టి పారేసిన నాని

Update: 2016-11-28 09:40 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా హిందీలో అగ్ర స్థాయి నటులతో నటించటమే కాకుండా మరపు రాని వైవిధ్య కథలలో కీలక పాత్రలు పోషించి తనదైన ముద్రను ఉత్తరాది ప్రేక్షకులపై వేసింది. ఇక ఇప్పుడు క్వాన్టికో అనే హాలీవుడ్ బుల్లి తెర సిరీస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించేసుకుంది ప్రియాంక చోప్రా. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు కాల్ షీట్స్ కూడా సర్దుబాటు చెయ్యలేని పరిస్థితి ప్రియాంకది. అయితే భారతీయ చిత్రాలను పూర్తిగా వదులుకోలేక అడపా దడపా తీరిక వున్నప్పుడు చిత్రాలలో నటిస్తూ, హిందీతోపాటు పలు భారతీయ భాషల్లో చిత్ర నిర్మాణం చేపట్టాలని నిశ్చయించుకుంది ప్రియాంక చోప్రా.

తెలుగు భాషలో ప్రియాంక చోప్రా నిర్మించబోయే చిత్రానికి నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా చేయనున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో నాని స్పందిస్తూ, "ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఏ నిర్మాణ సంస్థ నా తదుపరి కాల్ షీట్స్ బుక్ చేసుకోలేదు. ఇక ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుసు కానీ ఆవిడ ఏ సినిమా చేస్తున్నది కూడా నాకు తెలీదు. ప్రస్తుతం నేను లోకల్ త్వరగా పూర్తి చేసి డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి కృషి చేస్తున్నా. తదుపరి చిత్రాల వివరాలు నేనే స్వయంగా నేను లోకల్ విడుదల తరువాత వెల్లడిస్తాను." అని ప్రియాంక నిర్మాణంలో సినిమా ని ఖండిస్తూ తన చిత్ర వివరాలు తెలిపాడు నాని.

Similar News