ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమా లుక్

Update: 2017-02-24 18:24 GMT

బాలీవుడ్ లో టాప్ రెమ్యునెరేటేషన్ అందుకునే కథానాయికగా గుర్తింపు వున్న భామ. హిందీ సినిమా పరిశ్రమలో కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే హాలీవుడ్ నుంచి ముందుగా టెలి సిరీస్ క్వాంటికో లో నటించే అవకాశం రాగా బొంబాయి నుంచి తన మకాం న్యూ యార్క్ కి మార్చేసి దాదాపు ఏడాది పాటు అక్కడే స్థిరపడిపోయింది. క్వాన్టికో టెలి సిరీస్ బాగా సక్సెస్ కావటంతో ఇండియన్ బ్యూటీ అందాలను అరుదుగా చూసే హాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి ప్రియాంక చోప్రా పై పడింది. అలా ప్రియాంక చోప్రాకి అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవటం, చేస్తున్న టెలి సిరీస్ సీజన్ ముగియక ముందే 'బే వాచే' అనే హాలీవుడ్ చిత్రంలో కథానాయికగా అవకాశం రావటం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.

బాజీరావు మస్తానీ చిత్రంలో కథానాయికలుగా నటించిన ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లకు ఇద్దరికీ హాలీవుడ్ చిత్ర అవకాశాలు రాగా, దీపికా పదుకొనె నటించిన xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ చిత్రం గత నెలలో విడుదల ఐయింది కానీ ఇండియన్ మార్కెట్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే దీపికా పదుకొనె హాలీవుడ్ గ్లామర్ ని ఆస్వాదించేసిన ప్రేక్షకులు ప్రియాంక చోప్రా హాలీవుడ్ చిత్రంలో ఎలా కనిపించబోతోందో అని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మే 26 న విడుదల కాబోతున్న 'బే వాచే' చిత్రంలోని తన లుక్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రియాంక చోప్రానే విడుదల చేసింది.

Being bad can be so good. Coming soon.. #VictoriaLeeds #Baywatch #may26th

Similar News