ప్రియా ప్రకాశ్ వారియర్ కు బాలీవుడ్ ఏ హీరోస్ ఇష్టమో తెలుసా?

Update: 2018-02-21 09:24 GMT

సింగిల్ నైట్ లో స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ కేరళ ముద్దుగుమ్మకి బాలీవుడ్‌లో లో ఏ స్టార్స్ ఇష్టమో తన మనసులోని మాటను బయటపెట్టింది.

బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్దార్ధ్ మల్హోత్రా లాంటి హీరోలంటే ఇష్టం అని వాళ్లు ఒప్పుకుంటే వారి సరసన అవకాశం వస్తే నటిస్తానని చెప్పుకొచ్చింది. .. అలానే దీపికా పదుకునే అంటే ఇష్టం అని తన మనసులో మాట చెప్పింది. ఈ క్యూట్ గర్ల్ 'ఒరు అదార్ లవ్' అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఈ మూవీలో 'మాణిక్య మలరాయ పూవే' అనే సాంగ్ లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు అందర్నీ ముఖ్యంగా యూత్‌ను బాగా ఎట్రాక్ట్ చేశాయి. ఈ వీడియో యూట్యూబ్‌లో ఏకంగా 80 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో ప్రియా వారియర్‌ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Similar News