ప్రభుదేవా రెచ్చిపోయాడు

Update: 2018-02-23 08:28 GMT

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకుడిగా మారిన తర్వాత తన డాన్స్ టాలెంట్ ను అడపా దడపా మాత్రమే చూపిస్తున్నాడు. ఏబీసీడీ.. స్టైల్ వంటి చిత్రాలలో తన నృత్య ప్రతిభను చూపాడు ప్రభుదేవా. ఇప్పుడు మరోసారి తన డాన్స్ ప్రతిభను చూపించబోతున్నాడు.

అభినేత్రి వంటి చిత్రాన్ని తీసిన విజయ్ 'లక్ష్మి' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఓ డ్యాన్సింగ్ లెజెండ్.. అతని స్టూడెంట్ లక్ష్మి కథే ఈ చిత్రం. ఈ చిత్రంతో మరోసారి ప్రభుదేవా డ్యాన్సింగ్ ప్రతిభను పూర్తిగా ఉపయోగించబోతున్నాడు. లేటెస్ట్ గా 'లక్ష్మి' సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా అందులో డ్యాన్స్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియచేసేశారు.

డాన్స్ మీద సినిమా కాబ్బట్టి టీజర్ లో డాన్స్ తప్ప మరేమీ కనిపించలేదు. ప్రభుదేవా స్టూడెంట్ గా కనిపించిన ఈ అమ్మాయి కూడా డాన్స్ ఇరగదీసి పారేసింది. ఆమెకి ట్రైనింగ్ ఇచ్చే పాత్రలో ప్రభుదేవా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుదేవా డాన్స్ చేసిన చిత్రం ఏదన్న ఉంది అంటే అది ఇదే.

Similar News