ప్రభుత్వంపై వ్యతిరేక డైలాగ్సా

Update: 2018-04-17 09:00 GMT

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు సీఎం గా నటించిన భరత్ అనే నేను సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలున్న భరత్ కి సెన్సార్ వారు కూడా యు/ఏ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో పాటు ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ కూడా ప్లస్ అయ్యింది. సెన్సార్ బోర్డు వారు భరత్ అనే నేను సినిమా చూసి .... సినిమాపై పాజిటివ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా చెబుతున్నప్పటికీ... ఈ సినిమాలో ప్రస్తుత ప్రభత్వాలమీద ఏడెనిమిది సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయని... వాటికి కట్స్ ఇచ్చి మరీ సెన్సార్ వారు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా టాక్ బయటికి వచ్చింది.

ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగ్స్ ఉండడంతో వాటికి కట్స్ చెప్పాల్సి వచ్చిందని సెన్సార్ సభ్యుడొకరు తెలిపారు. కానీ కొరటాల ఈ సినిమా ద్వారా ఒక మెస్సేజ్ ని పాస్ చేయబోతున్నాడని... ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ సినిమాలో చాలా సామాజిక సందేశాల్ని అందించాడని అంటున్నారు. ఇక కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ మీద పట్టా పొందిన ఒక విద్యార్థి ఎలా పోరాడన్నదే ఈ భరత్ అనే నేను.. అని చెప్పిన వారు కొంతమంది రాజకీయనాయకుల మీద భారీ సెటైరికల్ డైలాగ్స్ కూడా భరత్ లో ఉండబోతున్నాయంటున్నారు.

ఇక సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా కొరటాల తీర్చి దిద్దాడని... సినిమాలో 80 శాతం రాజకీయ నేపథ్యంలోనే సినిమా ఉందంటున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. మరి ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా కొరటాల శివ ఈ సినిమా రన్ టైం ని ఫిక్స్ చేసాడట.. అయితే భరత్ అనే నేను రన్ టైం ఏకంగా 2.53 నిముషాలు అన్నట్లుగా తెలుస్తుంది. అయితే సినిమాలోని అద్భుతమైన ట్విస్టులు సినిమా రన్ టైం ని తినేస్తాయనే టాక్ మాత్రం బాగా వినబడుతుంది.

Similar News