ప్రభాస్ విషయంలో పూజ ని బలి చేశారా?

ప్రభాస్ సినిమా లుక్ వదలడం, సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని చెప్పడం రెండో రోజే ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా షూటింగ్ కి బ్రేకివ్వడం, దానితో [more]

Update: 2020-01-20 07:54 GMT

ప్రభాస్ సినిమా లుక్ వదలడం, సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని చెప్పడం రెండో రోజే ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా షూటింగ్ కి బ్రేకివ్వడం, దానితో సినిమా 2020 నుండి 2021 కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరిగింది. ఫస్ట్ లుక్ లో టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యకుండా దాచేసిన ప్రభాస్ టీం పూజాహెగ్డే అనారోగ్యం కారణంతో ప్రభాస్ – పూజ హెగ్డే నటించాల్సిన సెకండ్ షెడ్యూల్ కి బ్రేకిచ్చినట్లుగా చెప్పారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్, అఖిల్ సినిమా షూటింగ్ తో క్షణం తీరిక లేని పూజ సిక్ అయినందువలనే ప్రభాస్ సినిమా షూటింగ్ కి హాజరవలేదన్నారు.

కానీ తాజాగా పూజ హెగ్డే అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం వైజాగ్ లో దిగింది. దబ్బ పండులా మెరిసిపోతున్న పూజ హెగ్డే కి నీరసం ఏమిటి? పూజ వలన ప్రభాస్ సినిమా షూటింగ్ కి బ్రేక్ రావడమేమిటి? అంటూ పూజ ని ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ లో యాక్టీవ్ గా ఉన్న పూజ ని చూసిన ఎవ్వరన్నా అలాగే అంటారు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ పూజ వలన వాయిదా పడలేదనేది లేటెస్ట్ న్యూస్. ఇతర కారణాల వలన ప్రభాస్ – రాధాకృష్ణ సెకండ్ షెడ్యూల్ ఆగిందని.. ఇక కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో కృష్ణంరాజు తాను ప్రభాస్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైద్రాబాదులో మొదలయ్యిందని.. ఇక్కడే హైదరాబాద్ లోనే మూడు నెలల షూటింగ్ ఉంటుందని.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి…. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నామని స్వయానా కృష్ణంరాజే ప్రకటించడంతో ప్రభాస్ ఈ ఏడాదిలో ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చాడని క్లారిటీ వచ్చేసింది.

Tags:    

Similar News