ప్రభాస్ తదుపరి చిత్రం ఆలస్యానికి కారణం ఇదే

Update: 2017-01-07 02:45 GMT

2013 లో విడుదలైన మిర్చి నాటి నుంచి నేటి వరకు బాహుబలి చిత్రంలో తాను చేసిన ద్విపాత్రాభినయం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన శరీరంతో చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీకావు. ఒక వైపు శివుడి పాత్ర మరో వైపు అమరేంద్ర బాహుబలి పాత్ర ల మధ్య తన నటనతో పాటు తన శరీరంలోనూ వ్యత్యాసం చూపించటానికి ప్రభాస్ చాలానే శ్రమించాడు. ఇక బాహుబలి చిత్రం నుంచి ప్రభాస్ కి విముక్తి కలగటానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇక బాహుబలి చిత్రీకరణ తుది దశకు చేరటంతో ప్రభాస్ తన తదుపరి చిత్రంగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ కి చేయబోయే చిత్రం సంక్రాంతి పండుగ అనంతరం ముహూర్తం జరుపుకుని, ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని ఆశించారు ప్రభాస్ అభిమానులు.

బాహుబలి చిత్రంలోని పాత్రలకు అనుగుణంగా శరీర బరువు బాగా పెంచిన ప్రభాస్ తన తదుపరి చిత్రం కోసం సుమారు 20 కిలోలు తగ్గాల్సి ఉండటంతో ప్రత్యేక ఫిసికల్ ట్రైనర్ ని నియమించుకుని రానున్న రెండు నెలలలో తన శరీర బరువు తగ్గించే ప్రయత్నాలు మొదలెట్టనున్నాడు యంగ్ రెబెల్ స్టార్. అయితే 20 కిలోల బరువు తగ్గటం సాధారణమైన విషయం కాదు. దీనికి చాలా సమయమే పడుతుంది. అందుకే యూవీ క్రియేషన్స్ వారు ఈ నెలలో జరుపుకోవాల్సిన ముహుర్తాన్ని మార్చి నెలకి వాయిదా వేశారట. రెగ్యులర్ షెడ్యూల్ తాలూకా వివరాలు ఇంకా తెలియరాలేదు. చూస్తుంటే ఈ ఏడాది ఆఖరికి కూడా సుజిత్ రెండవ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు కనిపించటం లేదు.

Similar News