ప్రభాస్ కి షాకిచ్చిన పూజ హెగ్డే!!

ప్రభాస్ సాహో ప్లాప్ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని.. రాధాకృష్ణ మూవీ కోసం రెడీ అవడం.. ఆ సినిమా కూడా మొదలవడం జరిగింది. రధాకృష్ణ సినిమా షూటింగ్ [more]

Update: 2020-01-19 05:33 GMT

ప్రభాస్ సాహో ప్లాప్ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని.. రాధాకృష్ణ మూవీ కోసం రెడీ అవడం.. ఆ సినిమా కూడా మొదలవడం జరిగింది. రధాకృష్ణ సినిమా షూటింగ్ కొంతమేర జరిగినప్పటికీ. సాహో డ్యామేజ్ తర్వాత ప్రభాస్ ఆ సినిమాలో కొన్ని మార్పులు సూచించడంతో… ఆ సినిమా షూటింగ్ ని నిన్నటివరకు ఆపేసారు. అయితే కొత్తగా లుక్ తో పాటుగా సినిమా షూటింగ్ మల్లి మొదలెట్టబోతున్నట్టుగా చెప్పారు. అలాగే షూటింగ్ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మొదలయ్యింది. కానీ మళ్ళీ షూటింగ్ కి బ్రేకొచ్చింది. కారణం ప్రభాస్ సినిమా హీరోయిన్ పూజ హెగ్డే.

పూజ హెగ్డే ల వైకుంఠపురములో సినిమాతో పాటుగా అఖిల్ సినిమా షూటింగ్, అల వైకుంఠపురములో ప్రమోషస్న్ తో బిజీ గా ఉండడంతో రెస్ట్ లేకపోవడంతో.. పూజ అనారోగ్యం పాలవడంతో… ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోతుంది. అసలే ఆరు నెలల షూటింగ్ కి బ్రేక్ తో ఎలాగోలా మళ్ళీ పట్టాలెక్కిన ప్రభాస్ సినిమా ఇపుడు పూజమ్మ అనారోగ్యంతో మరోసారి వాయిదా పడింది. ఈ షెడ్యూల్ పూజ – ప్రభాస్ ల మీద చిత్రీకరించాల్సి ఉండడంతో.. దర్శకుడు కూడా చేసేదేమి లేక రొమాంటిక్ ఎపిసోడ్ పక్కనబెట్టి మరో కొత్త ఎపిసోడ్ కి ప్లాన్ చేస్తున్నాడట. మరి ప్రభాస్ – రాధాకృష్ణ కొత్త షెడ్యూల్ షూటింగ్ సెట్ కూడా మారబోతుందని తెలుస్తుంది. మళ్ళీ ఇవన్నీ సెట్ అయ్యేవరకు కొద్దీ టైం పట్టేలా ఉందంటున్నారు. అలాగే టైటిల్ విషయంలోనూ టీం ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే… లుక్ తో పాటుగా టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదని చేబుతున్నారు. ఇక ప్రభాస్ కొత్త సినిమా ఈఏడాది కూడా విడుదలకాకపోవచ్చని ప్రభాస్ ఫాన్స్ ఫీలవుతున్నారు.

Tags:    

Similar News