పైసా వసూల్ టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్స్

Update: 2017-11-12 04:54 GMT

బాలకృష్ణ - పూరి కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం క్లోజింగ్ కు చేరుకుంది. ఈ సినిమా మొదలు అయినప్పటి నుండి జనాలలో భారీ అంచనాలు పెరిగాయి. పూరి - బాలయ్య క్రేజీ కాంబినేషన్ కాబట్టి బయర్స్ కూడా ఈ సినిమాని భారీ రేట్స్ కి కొనుక్కున్నారు. అయితే సినిమా మాత్రం ఈ అంచనాలన్నిటిని తారుమారు చేసింది. మొదటి రోజు హిట్ టాక్ వచ్చిన రెండొవ రోజు నుండి మాత్రం నెగటివ్ టాక్ వచ్చేసింది. నెగటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే వసూల్ తగ్గిపోయాయి.

'పైసా వసూల్' తో పాటు రిలీజ్ అయినా సినిమాలు అన్ని వసూల్ తో సత్తా చాటుకోవడంతో 'పైసా వసూల్' సినిమా డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.19 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.32.5 కోట్లుకు అమ్ముడుపోయింది. అయితే క్లోజింగ్ వచ్చేసరికి రూ.19 కోట్లు మాత్రమే చేసింది అంటే డిస్ట్రిబ్యూటర్స్ రూ.13.5 కోట్లు నష్టపోయారు. 'పైసా వసూల్' టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ మీ కోసం..

ఏరియా షేర్స్ ( కోట్లు )

సీడెడ్ 4.28

నైజాం 4.10

గుంటూరు 2.20

వైజాగ్ 1.68

ఈస్ట్ గోదావరి 1.32

వెస్ట్ గోదావరి 1.05

కృష్ణ 1.17

నెల్లూరు 0.76

ఏపీ+ తెలంగాణ 16.56

కర్ణాటక 1.42

రెస్ట్ అఫ్ ఇండియా + రెస్ట్ అఫ్ వరల్డ్ 0.55

యూఎస్ఏ 0.47

టోటల్ వరల్డ్ వైడ్ 19.00

Similar News