పెళ్లి కమిట్మెంట్ ఉంటేనే డేటింగ్ డీల్

Update: 2017-02-18 16:32 GMT

సినిమా పరిశ్రమ అంటేనే లౌక్యం ప్రదర్శించే పరిశ్రమగా గుర్తింపు ఉంటుంది. కానీ అసలు ఏమాత్రం హిపోక్రసీ అలవాటు లేని కథానాయిక కంగనా రనౌత్ ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సూటిగా సమాధానం చెప్పటమే కాక, విమర్శలకు చాచి పెట్టి కొట్టినట్టు స్పందిస్తుంటుంది కంగనా రనౌత్. రంగూన్ చిత్ర ట్రైలర్ విడుదల ఐన నాటి నుంచి సోషల్ మీడియా అంతా కంగనా రనౌత్ ధైర్య సాహసాల గురించే చర్చించుకోవటానికి వేదికగా మారింది. 24 న విడుదల కానున్న ఈ చిత్ర ప్రచారాలకై వరుస ఇంటర్వ్యూ లు ఇస్తోన్న కంగనా రనౌత్ చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విశేషాలపై కూడా స్పందించింది.

ఇప్పటికే ఆదిత్య పంచోలి, అధ్యయన సుమన్, హ్రితిక్ రోషన్ లతో పాటు ఇంగ్లాండ్ కి చెందిన ఒక వ్యక్తితో కూడా డేటింగ్ చేసిన ఆరోపణలు కంగనా రనౌత్ పై ఉండగా ఇప్పుడు తనతో డేటింగ్ చేయాలంటే అవతలి వ్యక్తి ఇవ్వవలసిన కమిట్మెంట్స్ గురించి పక్కాగా చెప్పింది. "నేను నా జీవిత భాగస్వామి కి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాను. అలానే నా జీవిత భాగస్వామి నుంచి నేను కూడా అదే కోరుకుంటాను. అయితే నేను చట్ట రీత్యా కాగితాలలో వుండే బంధాల కంటే వ్యక్తుల మనసులతో ముడిపడి బంధాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. నాతో డేటింగ్ చేయాలనుకుంటే నాకు ముందుగా పెళ్లి కమిట్మెంట్ తో అప్రోచ్ అవ్వాలి. నాకు వారి అప్రోచ్, తరువాత సాన్నిహిత్యం నచ్చితే పెళ్లి వరకు తీసుకువెళతాను. కానీ కేవలం డేటింగ్ కి మాత్రమే పరిమితమయ్యే రిలేషన్ షిప్స్ ని నేను ఎంటర్టైన్ చేయను." అంటూ తన మనసులో మాటని సూటిగా చెప్పేసింది కంగనా రనౌత్.

Similar News