పెళ్లి అయ్యిందనే ప్రూఫ్ ఇదే

Update: 2018-03-20 07:10 GMT

శ్రియా శరణ్ పెళ్లి మార్చ్ లో అని ఉన్నట్టుండి ఒకరోజు మీడియాలో న్యూస్ తెగ చక్కర్లు కొట్టింది. రష్యా ప్రేమికుడు టెన్నిస్ ప్లేయర్ మరియు రెస్టారెంట్ల ఓనర్ అయిన ఆండ్రీ కొస్చీవ్ తో పెళ్లి అనే న్యూస్ ని మీడియా హైలెట్ చెయ్యగా.. ఆబ్బె అదేం లేదని శ్రియ అందరికి క్లారిటీ ఇచ్చింది. కానీ మొన్న అంటే మార్చ్ 12 న నిజంగానే శ్రియ శరణ్ తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ముంబయి లోని అంథేరోలోని శ్రియ ఇంట్లో గుట్టు చప్పుడు కాకూండా పెళ్లి చేసుకుందని ఒక ప్రముఖ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. కానీ శ్రియ మాత్రం నోరు విప్పడం కానీ తమ పెళ్లి విషయం షేర్ చేసుకోవడం కానీ చెయ్యలేదు.

మరి నిజంగానే శ్రియ శరణ్ పెళ్లి అయ్యిందా అనే అనుమానంలో చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు శ్రియ పెళ్లి నిజంగానే మార్చ్ 12 న అవవడమే కాదు ఉదయపూర్ లో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్యన రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసింది. మార్చ్ 12 న శ్రియ తన నివాసంలోనే సీక్రెట్ గా రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ని పెళ్లి చేసుకుందని ఇప్పుడు ప్రూప్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. శ్రియ - ఆండ్రీ కొస్చీవ్ ల పెళ్లి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకూండా ఉదయపూర్ లో 19 న అంటే నిన్న ఒక హోటల్లో రిసెప్షన్ పార్టీ కూడా ఇచ్చింది.

మరి తన పెళ్లిని అంత సీక్రెట్ గా ఎందుకు చేసుకుందో.. ఇప్పుడు పెళ్లి ఫోటోలను కావాలని ఎందుకు లీక్ చేసిందో గాని.. ఇలా సీక్రెట్ పెళ్ళికి మాత్రం విరాట్ కోహ్లీ - అనుష్క శర్మలు తెర లేపి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు శ్రియ శరణ్ సీక్రెట్ మ్యారేజ్ బయటికొచ్చేసింది. మరి ఇప్పటికే ఇలియానా పెళ్లి కూడా బాయ్ ఫ్రెండ్ తో జరిగిందనే న్యూస్ ఉంది. కానీ క్లారిటీ లేదు. అలాగే దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ లు కూడా సీక్రెట్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారని టాక్ ఉండనే ఉంది.

Similar News