పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన డైరెక్టర్

Update: 2017-10-27 11:49 GMT

వరస హిట్ సినిమాలు తీస్తున్న అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' కూడా సక్సెస్ అవ్వటంతో..ఆ దర్శకుడు ఫలానా హీరోతో సినిమా చేస్తాడని.. అంటూ చాలా రూమర్స్ తెరపైకి వచ్చాయి. అందులో భాగంగానే గీత ఆర్ట్స్ నుండి ఫోన్ వచ్చిందని... అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ లో పుకారులు హల్చల్ చేసాయి. తర్వాత అల్లు అర్జున్ తో కాదు..... ఈసారి నితిన్ సినిమా చేస్తాడని మళ్ళీ పుకారు వచ్చింది. నితిన్ కి స్టోరీ వినిపిస్తే ఒకే కూడా చేసాడని..... షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తాడు అని ఇలా చాలా రూమర్స్ వచ్చాయి.

అయితే హిట్స్ మీద వున్న అనిల్ రావిపూడి ఈ పుకారులు అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. నేను ఇప్పటివరకు ఏ హీరోకు కథ చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు. తన మైండ్ లో 2-3 కథలు ఉన్నప్పటికీ.. ఏ కథనూ ఇంకా ఫైనల్ చేయలేదని.. కథ ఓకే కాకుండా హీరోను ఎలా సంప్రదిస్తానని అంటున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం నేను 'రాజా ది గ్రేట్' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాని..కొన్ని రోజులు తర్వాత నా దగ్గర వున్న కథతో తనకి నచ్చిన హీరోస్ కి కథ చెపుతాని చెప్పారు.

ప్రస్తుతం 'రాజా ది గ్రేట్' సినిమా రెండో వారంలో ఎంటర్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తుంది. రవి తేజ ఇందులో అంధుడిగా నటించి ప్రేక్షక హృదయాలు గెలుచు కున్నాడు. మొదటి వారమే కాకుండా రెండో వారం కూడా అంతే స్ట్రాంగ్ గా కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంకా ఈ సక్సెస్ తర్వాత అనిల్ రవిపూడి ఏ హీరో తో చేస్తాడో చూద్దాం.

Similar News