పీపుల్స్ స్టార్ కి నైజాంలో మొండి చేయి

Update: 2017-01-11 04:52 GMT

సంక్రాంతి బరిలో రెండు భారీ చిత్రాలతో పాటు అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మించిన చిత్రాలకు థియేటర్లు ముందుగానే బుక్ ఐపోగా తమ సినిమాకు థియేటర్లు దొరకనివ్వట్లేదంటూ ఆర్.నారాయణ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా వారి ద్వారా ఫిలిం ఛాంబర్ ను, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చొరవ తీసుకుని ఊరుకి కనీసం ఒక్క థియేటర్ ఇప్పించవలసిందిగా కోరుకున్నారు ఆర్.నారాయణ మూర్తి. కాగా తాజాగా వెలువడిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య నైజాం ప్రాంత విడుదల కేంద్రాలు చూస్తుంటే పీపుల్స్ స్టార్ కి ఫిలిం ఛాంబర్ మొండి చేయి చూపిందని స్పష్టంగా తెలుస్తుంది. నైజాం ప్రాంతంలో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ పంపిణీ చేస్తున్న ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కేవలం 16 థియేటర్లు, 6 మల్టీప్లెక్స్ లలో కొన్ని షోలకు మాత్రమే థియేటర్లు సర్దుబాటు జరిగాయి.

హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య నైజాం విడుదల కేంద్రాలు:

సుదర్శన్ 35 ఎంఎం - ఆర్.టి.సి కాంప్లెక్స్

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్ గిరి

లక్ష్మి కళ - మూసాపేట్

అంజలి - సికింద్రాబాద్

సినీ స్క్వేర్ - ఉప్పల్

రాధికా - కాప్రా

శివగంగ - దిలీశుఖ్ నగర్

షా షాహెన్ష - చింతల్

ఏషియన్ జిపీఆర్ - కూకట్ పల్లి

ఏషియన్ ఎంక్యూబ్ - అత్తాపూర్

రామకృష్ణ - వరంగల్

కిన్నెరసాని - ఖమ్మం

అశోక్ - నిజామాబాద్

రాజా డీలక్స్ - కరీంనగర్

అలంకార - సూర్యాపేట

వెంకటేశ్వర - తొర్రూర్

సీతారాం - సిద్దిపేట

కృష్ణ - సత్తుపల్లి

ఎస్ఎస్ వి గణేష్ - షాద్ నగర్

రాజా రమేష్ - ఆర్మూర్

పరమేశ్వర - కొత్తగూడెం

లక్ష్మి - అచ్చంపేట

Similar News