పార్టీలకి హాజరవుతోంది.. ఇక షూటింగ్స్ కి ఎప్పుడో?

Update: 2017-01-27 22:30 GMT

ఇండియన్ హీరోయిన్స్ కి జీరో సైజు పరిచయం చేసిన కరీనా కపూర్ ఖాన్ వయసు ముప్పైలోకి పడ్డ తరువాత కూడా ఫ్యసిక్ ని కాపాడుకుంటూ వచ్చింది. గత ఏడాది గర్భం దాల్చిన అనంతరం కూడా సినిమా షూటింగ్స్ లో పాల్గొన్న కరీనా కపూర్ తొమ్మిది నెలల గర్భంతో కూడా ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ ఐయింది. గత ఏడాది డిసెంబర్ 20 న ఒక మెగా బిడ్డకు జన్మనిచ్చిన కరీనా నెల రోజులు తిరిగే సరికే బాలీవుడ్ లో తన సన్నిహితుల పార్టీలకు హాజరు అవుతుంది. ఇటీవల జరిగిన ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఇచ్చిన పార్టీ కి హాజరైన కరీనా కపూర్ తల్లి అవటంతో కొద్దిగా ఒళ్ళు చేసినట్టు కనిపించింది కానీ ఫిసికల్ గా ఫిట్ గానే ఉండటంతో పాటు, అందంలో ఎలాంటి కొరత కనపడలేదు.

కరీనా కపూర్ ఖాన్ ముప్పైల వయసులోకి వచ్చాక కూడా అగ్ర కథానాయకులతో పాటు యంగ్ హీరోస్ సరసన కూడా నటిస్తూ టీనేజ్ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇచ్చిన కరీనా తల్లి ఐన నెల రోజులకే తిరిగి తన గత శరీరాకృతి పొందుతుండటంతో కరీనా కపూర్ త్వరలోనే సినిమా షూటింగ్స్ కి కూడా సిద్దమవుతుందేమో అని బాలీవుడ్ లో చర్చ మొదలైయ్యింది. ఇప్పటి వరకు అయితే కరీనా కపూర్ ఎటువంటి కథలు వింటున్నట్టు వార్తలు లేవు. అయితే విద్య బాలన్, రాణి ముఖర్జీ వంటి హీరోయిన్స్ లా లేట్ నలభై లకు చేరువవుతున్న తరుణంలో కొన్ని పాత్రలకు మాత్రమే పరిమతమయ్యే అవసరం లేదని కరీనా కపూర్ ఖాన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అర్ధం అవుతుంది. మరి కరీనా కపూర్ కెరీర్లో వచ్చిన గ్యాప్ తరువాత వచ్చే తొలి ఆఫర్ ఎంత గ్లామర్ పాత్ర అవుతుందో చూడాలి.

Similar News