పార్టనర్ గురించి సమంత ఏం చెబుతున్నదంటే...

Update: 2016-09-23 05:43 GMT

మేము మొదటి సినిమాతోనే మంచి అనుబంధాన్ని స్నేహాన్ని మైంటైన్ చేస్తున్నామని.......సమంత నహ చైతన్య గురుంచి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసింది. మా ఇద్దరి ప్రేమకు పెద్దల ఆశీస్సులు పుష్కలం గా ఉన్నాయని చెప్పుకొస్తుంది సమంత. అందుకే ఇప్పటి వరకు మా పెళ్లి గురించి బహిరంగంగా మాట్లాడలేదు అని చెప్పింది సమంతా. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లితో పాటు కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిందీ చెన్నై సుందరి. వివాహం చేసుకున్నాక కూడా సినిమాల్లో నటిస్తానని, ఈ విషయంలో చైతూకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

అయితే పెళ్లాయ్యాక తనను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో వారే నిర్ణయించుకోవాలని పేర్కొంది. బాలీవుడ్‌లో ఎందరో కథానాయికలు పెళ్లిచేసుకొని సినిమాలు చేస్తున్నారు. వారికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దక్షిణాది ప్రేక్షకులు కూడా అదే విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని సమంతా చెప్పింది. మరి సమంతని కూడా ప్రేక్షకులు పెళ్ళైక బాగా ఆదరిస్తారా.... లేక ఆంటీ అని ఫిక్స్ అయిపోయి అవాయిడ్ చేస్తారా అనేది తేల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి తనని తాను బాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చుకుని తెగ మాట్లాడిన సమంత అక్కడి వాళ్ళు పళ్లైయ్యాక కూడా హాట్ హాట్ గా కనిపించి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారు. అందుకే వారిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. మరి పెళ్లైయ్యాక కూడా సమంత ఇంతే గ్లామర్ గా కనబడితే టాలీవుడ్ ఏమిటి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా సమంతని మెచ్చుకుంటారు. మరి సమంత నువ్వందుకు రెడీ నా అని కొందరు అప్పుడే సెటైర్స్ వేసేస్తున్నారు.

ఇక సమంతని నాగచైతన్యలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటని ప్రశ్నించగా చైతూ నా మార్గదర్శి. సంక్షోభంలో వున్న నా జీవితానికి అతను ప్రశాంతతను, స్ధిరత్వాన్ని కల్పించాడు. అతనే నా ప్రపంచం. మా ఇద్దరి అనుబంధం కలకాలం ఇలాగే వుంటుంది అని సమంతా పేర్కొంది. వారిద్దరి అనుబంధం అలానే కొనసాగాలని మనము ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Similar News