పారితోషకం విషయంలో అబద్దాలు చెబుతుందా?

స్టార్ హీరోల సినిమాలతో రష్మిక మందన్న పారితోషకం భారీగా పెంచింది అనే ప్రచారం జరిగినప్పుడు.. డిమాండ్ ఉన్నపుడే కదా పారితోషకం పెంచేది అంటూ లెక్చర్ ఇచ్చిన రష్మిక [more]

Update: 2020-01-19 13:31 GMT

స్టార్ హీరోల సినిమాలతో రష్మిక మందన్న పారితోషకం భారీగా పెంచింది అనే ప్రచారం జరిగినప్పుడు.. డిమాండ్ ఉన్నపుడే కదా పారితోషకం పెంచేది అంటూ లెక్చర్ ఇచ్చిన రష్మిక ఇప్పుడు తన పారితోషకం విషయంలో అబద్దాలు చేబుతుందంటున్నారు ఐటి అధికారులు. దాదాపు కోటి పారితోషకం తీసుకుంటున్న రష్మిక కేవలం 60 లక్షలకే పన్ను చెల్లిస్తుంది అంటున్నారు. తాజాగా రష్మిక ఇంటిపై ఆఫీసు పై జరిగిన దాడుల్లో తన తండ్రికి సంబందించిన కాఫీ తోటల డాక్యుమెంట్స్ తో పాటుగా రష్మిక పారితోషకాన్ని సంబందించిన లెక్కల వివరాలు సేకరించారని, దానిలో భాగంగా రశ్మికాని విచారణకు కూడా పిలిచారని టాక్ నడుస్తుంది.

రష్మిక తో పాటుగా ఆమె తండ్రి మదన్‌ మందణ్ణ, తల్లి సుమన్‌లకు ప్రత్యేకమైన నోటీసులు జారీచేశారు. వారంతా ఈనెల 21న మంగళవారంనాడు విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. కానీ రష్మిక మేనేజర్ మాత్రం రశ్మికకి ఐటి దాడులకి సంబంధం లేదని, కేవలం రష్మిక తండ్రి కాఫీ తోటల వ్యహారంలోనే ఈ ఐటి దాడులు జరిగాయని, రష్మిక సినిమాలకు, పారితోషకాలతో ఐటి శాఖ ఎలాంటి దాడులు చేయలేదని అసలు రష్మిక పారితోషకాలు, లెక్కలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని.. కానీ ఐటి అధికారులు బెంగుళూరు శివార్లోని మడికేరి జిల్లా విరాజ్‌పేట్‌లోని కుక్లూర్‌ గ్రామంలో గల రష్మిక నివాసం, ఆఫీసు, కళ్యాణమండపంపై అధికారులు రెండు బృందాలుగా దాడులు చేశారని.. ఇది కేవలం రష్మిక తండ్రి పై జరిగిన ఐటి బదులుగా వివరణ ఇస్తున్నాడు. మరి రష్మిక పారితోషకం విషయంలో ఎలాంటి దాడులు జరగలేదని చెబుతున్నప్పటికీ.. రష్మిక మాత్రం పారితోషకం లెక్కల విషయంలో నిజం దాస్తున్నట్టుగా చెబుతున్నారు ఐటి అధికారులు.

Tags:    

Similar News