పాపం సునీల్

Update: 2018-01-04 10:06 GMT

ఈ మధ్య డిజాస్టర్ అయిన సినిమా ఏదన్నా ఉందంటే అది సునీల్ నటించిన 2-కంట్రీస్ సినిమా అనే చెప్పొచ్చు. ఈ సినిమా సునీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఏరియాలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో 40శాతం వసూళ్లు కూడా రాలేదు.

ఇక ఓవర్సీస్ సంగతి సరేసరి. 2-కంట్రీస్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా ఆరిపోయారు. ఈ సినిమాను ఎత్తాలో.... వుంచాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన.. డైరెక్టర్ శంకర్ కూడా భారీనష్టాలు తప్పలేదు. సునీల్ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన ఫ్లాపులు ఒక ఎత్తు..... 2 కంట్రీస్ ప్లాప్ మరోఎత్తు. వీకెండ్ తో పాటు జనవరి 1 కలిసొచ్చినా సినిమా తేరుకోలేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ అర్థంచేసుకోవచ్చు.

ఇక సునీల్ హీరో వేషాలకి ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు అంటున్నారు జనాలు. 2-కంట్రీస్ విడుదలకు ముందే హీరోగా సునీల్ రెండు సినిమాలు హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఆ సినిమాలు చేస్తాడో చేయడో.. ఒకవేళ చెయ్యకపోతే... తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాడా అనేది మాత్రం ఫుల్ సస్పెన్స్.

Similar News