పాపం సందీప్ కిషన్!!

Update: 2017-11-17 17:00 GMT

'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' సినిమా తర్వాత సందీప్ కిషన్ కి చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి లేవు. లేటెస్ట్ గా వచ్చిన 'కేరాఫ్‌ సూర్య' కూడా ఫ్లాప్‌ కోటాలో చేరిపోయింది. కాన్సెప్ట్ సినిమాలు వదిలేసి కమర్షియల్‌ హీరోగా ఎదగాలని చూసి చేజేతులా పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. దీంతో కెరీర్ ని తన దారిలోకి తిప్పుకోవడంలో విఫలమయ్యాడు.

సక్సెస్ రేటు లేక...

తీసింది తక్కువ సినిమాలే అయినా సక్సెస్ రేట్ లేకపోవడం తో కొత్తరకం కథలకి పెద్ద పీట వేసాడు. కానీ అవి కూడా అంత సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి. అసలే మిడ్‌ రేంజ్‌ హీరోల మధ్య పోటీ పెరిగిపోవడంతో మంచి కథలు దొరకడం కష్టమైపోతోంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాలు చేస్తే మార్కెట్‌ వుంటుందని భావించి చేసిన సినిమాలేవీ.. కలిసి రావడం లేదు. 'నగరం' సినిమా తనకు పేరు తెచ్చింది కానీ కమర్షియల్‌గా సక్సెస్‌నివ్వలేదు. ఇక 'కేరాఫ్‌ సూర్య' మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంటే అది కూడా నిరాశపరిచింది.

కెరియర్ కష్టాల్లో...

దీంతో ఇంకా సందీప్ కిషన్ కెరియర్‌ కష్టాల్లో పడింది. బ్రాండ్లు కంటే ఒక కథని నమ్ముకుని, దానికి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చి దాంతోనే నిలబడడానికి సందీప్‌ ట్రై చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాంటి కథలు, డైరెక్టర్స్ సందీప్ కిషన్ కు దొరుకుతుందని ఆశిద్దాం.

Similar News