పాపం ఈమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు అయ్యాయి

Update: 2017-01-24 08:37 GMT

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ బొంబాయి వెళ్లి బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదిగిన సందర్భాలను మళ్లీ కళ్లకు కట్టినట్టు చూపించింది అదే కర్ణాటక నుంచి బొంబాయి వెళ్లి బాలీవుడ్ లో స్థిరపడి అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్న దీపికా పదుకొనె. దాదాపు సంవత్సర కాలం నుంచి దీపికా పదుకొనె హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ చిత్రం గురించే బాలీవుడ్ మొత్తం చర్చించుకునే విధంగా ప్రవర్తించింది దీపికా పదుకొనె. బాజీరావ్ మస్తానీ వంటి సంచలన విజయం తరువాత సంజయ్ లీల బన్సాలి ఇచ్చిన మరో సదావకాశం పద్మావతి చిత్రంలో రాణి పద్మావతి పాత్ర కోసం ఏకంగా 13 కోట్ల రూపాయల పారితోషికం అందుకోవటం తో చారిత్రాత్మక పాత్ర పోషించటానికి డిమాండ్ చేసిన పారితోషికంతో దీపికా కొత్త చరిత్ర సృష్టించిందనే కామెంట్స్ తో పాటు ఒక్క సినిమాతోనే హాలీవుడ్ బుద్దులు బాగా ఒంటపట్టాయని దీపికా పదుకొనె గురించి బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ విడుదలై విజయం సాధిస్తే దీపికా పదుకొనె ని తమ చిత్రాలలో నటించమని సంప్రదించే ధైర్యం ఏ బాలీవుడ్ నిర్మాతకి ఉండదు అనే భయం కూడా చాలా మందిలో వుంది. దీపికా పదుకొనె కూడా ఈ చిత్ర ప్రచారం కోసం కొన్ని రోజులు పద్మావతి చిత్రీకరణ నుంచి బ్రేక్ తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా xxx రిటర్న్స్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ని జనవరి 20 న విడుదలకి సిద్దమవుతున్న నిర్మాతలను పట్టుబట్టి భారత దేశంలో 14 నే విడుదల అయ్యే విధంగా ఒప్పించింది దీప్స్. ఈ ప్రణాళిక ప్రకారమే సరిగ్గా రెండు రోజుల ముందు హాలీవుడ్ నటుడు విన్ డీసెల్ ని భారత దేశానికి రప్పించి బొంబాయి లో ప్రచార కార్యక్రమాలలో అతనితో కలిసి పాల్గొంది. ఈ హాలీవుడ్ చిత్రం కోసం దీపికా పదుకొనె ఇంతా కష్టపడితే ఈ చిత్రం మన దేశంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీనితో దీపికా పెట్టుకున్న ఆశలన్నీ చెదిరిపోయాయి. దానితో చప్పుడు చేయకుండా తిరిగి పద్మావతి షూటింగ్లకి హాజరు అవుతుంది. ఇక ఇప్పట్లో దీపికా పదుకొనె కి హాలీవుడ్ నుంచి మరో అవకాశం దక్కటం కూడా కష్టమే.

Similar News