పాపం అస్సలు కలిసిరావడంలేదు

Update: 2017-08-12 12:00 GMT

ఈమధ్యన గోపిచంద్ టైం అస్సలు బావున్నట్టు లేదు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి. కొని సినిమాలైతే అస్సలు థియేటర్స్ లోకి కూడా రాకుండా విడుదలకు నోచుకోకుండా ఉండి పోతున్నాయి. తాజాగా 'ఆరడుగుల బులెట్' సినిమా విడుదల కాకూండా ఫైనాన్స్ ప్రోబ్లెంస్ వల్ల ఆగిపోయింది. అలాగే గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్లో వచ్చిన 'గౌతమ్ నందా' కి కూడా ఆశించిన ఫలితం రాలేదు. మొదట కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత కలెక్షన్స్ బాగా తగ్గాయనే టాక్ వినిపిస్తోంది.

అయితే తాజాగా 'గౌతమ్ నందా' చిత్ర యూనిట్ గోపీచంద్ కెరీర్ లోనే మొట్ట మొదటీ సారిగా మొదటి వారం 20 కోట్లు కలెక్షన్స్ సాధించిందంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. కానీ ఆపోస్టర్ మీద ఇప్పుడు అనేక కామెంట్స్ పడుతున్నాయి. 'గౌతమ్ నంద' ఆ స్థాయిలో హిట్ కాలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి చిత్ర యూనిట్ కూడా అంత కలెక్షన్స్ రానప్పుడు ఇలా పోస్టర్ తయారు చేసి వదలడమెందుకు..... ఇప్పటికే 'డీజే' విషయంలో ఇలానే జరిగింది. 100 కోట్ల 'డీజే' అంటూ పోస్టర్స్ వేయించిన చిత్ర యూనిట్ కి మెగా ఫాన్స్ దిమ్మరిగే షాక్ ఇచ్చిన విషయం మరవకముందే.... ఇప్పుడు ఇలా 'గౌతమ్ నందా' గురించిన పోస్టర్ వెయ్యడం అవసరమా అంటూ కామెంట్స్ పడేస్తున్నారు.

మరి అన్ని కలెక్షన్స్ సాధించాయని చెబుతున్న చిత్ర యూనిట్ కి ఈవారం బాగా గట్టిగానే దెబ్బపడింది. ఇక దాదాపు 'గౌతం నందా' సినిమా కలెక్షన్స్ ఈ వారంలో క్లోజ్ అవుతాయనే తెలుస్తోంది. ఎందుకంటే ఈ వారం విడుదలైన 'లై, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక' చిత్రాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. ఈలెక్కన 'గౌతమ్ నందా' సినిమా థియేటర్స్ నుండి ఎప్పుడో తీసేసి ఉంటారు కూడా. ఇకపోతే ఈ సినిమా మీద నమ్మకంతో డైరెక్టర్ సంపత్ నంది, గోపీచంద్ లు ఇద్దరూ రెమ్యునరేషన్ పూర్తిగా తీసుకోలేదట. గోపీచంద్ మార్కెట్ కన్నా బడ్జెట్ ఎక్కువ స్థాయిలో అవ్వడంతో సినిమా సక్సెస్ తర్వాత చూసుకోవచ్చని అనుకున్నారట. కానీ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో ప్రొడ్యూసర్స్ తో పాటు గోపి కి , సంపత్ నందికి కూడా 'గౌతమ్ నంద' నష్టాలనే మిగిల్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Similar News