పాత్ర కోసం ఆ మాత్రం కష్టపడాలి అంటున్న హీరో!!

Update: 2018-02-16 13:00 GMT

పాత్రకు తగ్గట్టు తనని తానూ మార్చుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ ప్రభాస్ కి ఇది చాలా సులువే అని అనిపిస్తుంది. పాత్ర కోసం అప్పుడప్పుడు బరువు తగ్గాలి అలానే పెరగాలి. ఎప్పటికప్పుడు కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేయాలి. బాహుబలి లో బాహుబలిగా ఆజాను బాహుడిగా కనబడిన ప్రభాస్ తర్వాత నటిస్తున్న సాహో చిత్రానికి మళ్లీ స్లిమ్మయి స్టయిలిష్ లుక్ తో అదరగొట్టేశాడు.

ఎంత కష్టాన్నైనా....

'నేను ఎప్పుడూ ఒకే పాత్ర చేయటానికి ఇష్టపడను. సినిమాలో నేను చేయాల్సిన పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోకపోతే ఆ కథను ఒకే చేయను. ఈ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడాలి అనిపించేలా ఉండాలి. కొత్తగా ప్రయతించాలి అంటే ఇలాంటివి తప్పవు'.... అంటూ ప్రభాస్ తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. తెలుగు...హిందీ...తమిళం..మళయాళం ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నాడు.

Similar News