పవర్ స్టార్ సినిమాకి ప్రమోషనల్ సాంగ్స్ కూడా

Update: 2016-11-25 06:00 GMT

వై దిస్ కొలవెరి డి అంటూ యావత్ దేశంలో మారుమోగిపోయిన యువ సంగీత దర్శకుడు అనిరుద్ తమిళ చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకు పోతున్నాడు. మన పరిశ్రమలో ప్రముఖ దర్శకులు శ్రీను వైట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఇప్పటికే రెండు మార్లు అవకాశం కలిపించినా అనిరుద్ టాలీవుడ్ ఎంట్రీ కొన్ని అనివార్య కారణాల రీత్య వాయిదా పడుతూ వస్తుంది. రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ, నితిన్ నటించిన అఆ చిత్రాలకు తొలుత అనిరుద్ సంగీత దర్శకుడు అని అధికారిక ప్రకటనలు కూడా జరిగిపోయాయి. కానీ అవి కాస్తా థమన్, మిక్కీ జె మేయర్ ఖాతాలో పడిపోయాయి.

ఇలా రెండు అవకాశాలు కోల్పోయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ చెయ్యటానికి త్రివిక్రమ్ ఒక ప్లాటుఫార్మ్ కలిపించటంతో బాగా జోష్ మీద వున్నాడు అనిరుద్. పవర్ స్టార్ అభిమానులు ఉర్రూతలూగే సంగీతాన్ని అందిస్తానని మాట ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్గా వుండే అనిరుద్, "పవన్ కళ్యాణ్ గారి సినిమా తో నా గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుంది. ఇంకా మ్యూజిక్ కంపోసింగ్ మొదలు పెట్టలేదు. త్రివిక్రమ్ గారు కథ మొత్తం నేరేట్ చేశారు. నేను ఆయనతో మరోసారి సంప్రదించి ప్రమోషనల్ సాంగ్స్ కూడా ప్లాన్ చేస్తాను. ఏది చేసినా పవర్ స్టార్ అభిమానుల అంచనాలు కచ్చితంగా చేరుకుంటాను." అని ట్వీట్ చేసాడు.

వై దిస్ కొలవెరి తరువాత వరుస అవకాశాలు ఉన్నప్పటికీ అంతటి స్థాయి గుర్తింపు రాలేదు కానీ, తమిళ నటుడు శింబు తో చేసిన ప్రైవేట్ ఆల్బుమ్ వివాదాస్పదం కావటంతో మళ్లీ దేశ వ్యాప్తంగా ఈ యువ దర్శకుడి పేరు మార్మోగిపోయింది.

Similar News