పవన్ పర్సనల్ పనులుకు ఒకరు కావాలి

Update: 2017-11-30 15:00 GMT

పవన్ కళ్యాణ్ ఎంతగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడినా కూడా తనికి సంబందించిన సినిమా వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఎవరో ఒకరుండాలి. అసలు చాలామంది తమ దగ్గర పనిచేసే వాళ్ళను ఎక్కువ కాలం ఉంచేసుకుంటారు. కానీ పవన్ మాత్రం ఎప్పటికపుడు వారిని మార్చేస్తూ ఉంటాడు. పవన్ కి దగ్గరగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా కొంతకాలానికి దూరమవుతుంటారు. అందుకు పక్కా ఉదాహరణ బండ్ల గణేష్, నిర్మాత శరత్ మరార్ లు. తాను ఎంతగా నమ్మిన వ్యక్తులను అయినా పవన్ కళ్యాణ్ ఎక్కువకాలం తన దగ్గర ఉంచుకోడనే నానుడి ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ పనులను చక్కబెట్టేందుకు ఎవరూ లేకపోయేసరికి పవన్ కళ్యాణ్ తో అటు ఫాన్స్ గాని ఇటు మీడియా గాని పర్సనల్ గా కలవడానికి ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు. అందుకే పవన్ కి సంబందించిన వ్యవహారాలు చెక్కబెట్టేందుకు ఎవరు లేకే.. అటు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా పవన్ కి సంబందించిన వివరాలు ఫాన్స్ కి అందడం లేదంటున్నారు. మరి సినిమాల్తో రాజకీయాలతో బిజీగా వుండే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు కేవలం ఒకే ఒక వ్యక్తి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు. ఆయనెవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి త్రివిక్రమ్ కూడా పవన్ సినిమా అప్పుడు ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నా.. వేరే స్టార్ హీరోలతో సినిమాలు చేసే టప్పుడు పవన్ తో గ్యాప్ వచ్చేస్తుంది.

అలాగే పవన్ మాదిరిగానే త్రివిక్రమ్ కూడా అందరితో రాసుకుని పూసుకొని కలిసిపోడు. మరి ప్రస్తుతం పవన్ ని కలవాలి అంటే... అసలు వేరే ఆప్షన్ లేకుండానే పోయింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు మీ బాధ్యతలు చక్కబెట్టేందుకు మీరొక పర్సనల్ వ్యక్తిని అప్పాయింట్ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారంటే చూడండి పరిస్థితి ఎలా ఉందొ.

Similar News