పవన్ కుమ్మేస్తాడట

Update: 2017-10-31 08:32 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా షూటింగ్ దగ్గరపడింది. నవంబర్ ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ 'అజ్ఞాతవాసి'గా ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ లోగోని త్రివిక్రమ్ పుట్టినరోజునాడు రివీల్ చేస్తారనే ప్రచారం ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ గా ట్రైన్ అవుతున్నాడట. దాదాపు రెండు నెలల పాటు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీసు చేసాడట. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ గా ఉంటాయి.

ఇక ఇప్పుడు ఈసినిమాలో కూడా ఫైట్స్ చాలా స్టైలిష్ గా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో... ఉండబోతున్నట్టుగా చెబుతున్నారు. కొత్తగా ఉండే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలేట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇటీవలే జరిగిన షెడ్యూల్లో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరన జరిపింది చిత్ర బృందం. ఇక నవంబర్ మొదటివారంలో త్రివిక్రమ్ పుట్టినరోజున సినిమా టైటిల్ లోగోని విడుదల చేసి నవంబర్ చివరిలో సినిమా టీజర్ ని విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తున్నారు.

Similar News