పవన్ కళ్యాణ్ కి తోడుగా ఇతర స్టార్ హీరోస్ ఎవరూ లేరట

Update: 2017-02-20 16:47 GMT

జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో ప్రేక్షకులను రంజింపచేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఈ ఏడాది మరొక సారి ప్రేక్షకులని అలరించటానికి సిద్ధపడుతున్న సంగతి విదితమే. అయితే గత కొంత కాలంగా ఈ చిత్రానికి సంబంధించిన కాస్టింగ్ పనులలో త్రివిక్రమ్ మరియు అతని టీం బిజీగా ఉండగా, పవన్ కళ్యాణ్ కి సోదరుడి పాత్ర కోసం మలయాళం మెగా స్టార్ మోహన్ లాల్ ని సంప్రదించారని టాక్ హల్చల్ చేసింది. అయితే మోహన్ లాల్ కోసం పాత్ర సృష్టించినట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ మధ్య మోహన్ లాల్ మళయాళంతో పాటు తెలుగు సినిమాలను కూడా విరివిగా అంగీకరిస్తుండటంతో ఈ వార్త బలపడింది.

వచ్చే నెల 14 న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించటానికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మోహన్ లాల్ నే కాక తమ సినిమాలో నటింపజేయటానికి ఏ ఇతర స్టార్ హీరోని తాము సంప్రదించలేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబో కాటమరాయుడు చిత్రీకరణ, మరియు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ షెడ్యూల్స్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకుని లొకేషన్స్ సెర్చింగ్ లో నిమగ్నమైపోయారు త్రివిక్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ .ఈ చిత్రం పూర్తయిన తరువాత కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా స్టార్, పవర్ స్టార్ లు కలిసి ముల్టీస్టార్రర్ చేయనున్న సంగతి తెలిసిందే.

Similar News