పవన్ ఆ దర్శకుడిని అవమానించాడా?

Update: 2017-10-25 03:45 GMT

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలను అమలు చేస్తున్నాడనే గాసిప్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఆత్మ త్రివిక్రమ్ అంటారు ఇండస్ట్రీలోని జనాలు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటె త్రివిక్రమ్ అక్కడ ఉండడం అనేది పరిపాటిగానే మారింది. ఇకపోతే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడంటున్నారు. కందిరీగ, రభస,హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కి పవన్ అవకాశమిచ్చాడనే న్యూస్ ప్రచారంలో ఉంది.

అయితే ఆ దర్శకుడు ఈ మధ్యన స్క్రిప్ట్ లోని కొన్ని సీన్స్ ని పవన్ కి వినిపిద్దామని వెళ్లగా.. పవన్ మాత్రం ఏ విషయమైనా నాతొ కాదు త్రివిక్రంతో చర్చించమని చెప్పడంతో సంతోష్ కొద్దిగా షాక్ అయ్యాడట. మరి అవడా... తానొక దర్శకుడై ఉండి మరొక దర్శకుడితో తన సీన్స్ ని షేర్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పవన్ తో సినిమా చేద్దామంటే... కాదు ముందు త్రివిక్రమ్ తో మాట్లాడంటే తన దర్శకత్వాన్ని అవమానించినట్లే కదా... అని అనుకున్నాడో ఏమో సంతోష్ అక్కడినుండి మెల్లగా వెళ్ళిపోయాడట.

మరి తాను ప్లాప్స్ లో ఉన్నాడు కాబట్టి ఏం చేతితె అది వింటాడనుకున్న పవన్ ఇలా చెప్పేశాడేమిటా అని తెగ మధన పడుతున్నదంట దర్శకుడు సంతోష్.

Similar News