పబ్లిసిటీ కోసం ఇంత దిగజారుడు వైనమా?

Update: 2017-03-10 19:01 GMT

గత కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ కి చెందిన నిర్మాత తాను నిర్మించిన అనార్కలి ఆఫ్ ఆరా చిత్రం నుంచి సెన్సార్ వారి కత్తెరకి బలైన కొన్ని నగ్న దృశ్యాలు తమ ప్రమేయం లేకుండా నెట్ లో తారసపడ్డాయ్ అంటూ బొంబాయి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. అనార్కలి ఆఫ్ ఆరా చిత్రంలో కథానాయికగా నటించిన స్వర భాస్కర్ అర్ధ నగ్న ప్రదర్శనలు, ఇంటిమేట్ సన్నివేశాలకు చెందిన ఫుటేజ్ ఎవరో లీక్ చేసారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన బొంబాయి పోలీసులకి కంగు తినే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సెన్సార్ కట్ కి గురైన వీడియో అని అనార్కలి ఆఫ్ ఆరా చిత్ర బృందం ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొనగా పోలిసుల దర్యాప్తులో అసలు ఇప్పటి వరకు అనార్కలి ఆఫ్ ఆరా చిత్రం సెన్సార్ కార్యక్రమాలే జరుపుకోలేదని నిర్ధారణ ఐయ్యింది.

బొంబాయి సెన్సార్ బృందంలోని ముఖ్య సభ్యుడు పహ్లాజ్ నిహ్లానీ అసలు అనార్కలి ఆఫ్ ఆరా చిత్రం నేటి వరకు సెన్సార్ కార్యక్రమాల కోసం అసలు ధరఖాస్తే చేసుకోలేదని వాంగ్మూలం ఇవ్వటంతో పోలీసులు తమ పద్దతిలో విచారణ జరపగా చిత్ర బృందం పాల్పపడ్డ దిగజారుడు వ్యూహం బైట పడింది. చిత్రీకరణ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సమయానికి కూడా అనార్కలి ఆఫ్ ఆరా చిత్రానికి అనుకున్న స్థాయిలో బజ్ ఏర్పడకపోవడంతో చిత్ర నిర్మాత స్వయంగా స్వర భాస్కర్ నటించిన న్యూడ్ సన్నివేశాలను నెట్ లో వీక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చి తమ చిత్రానికి పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ విచారణలో ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందమే ఒప్పుకోవటంతో బాలీవుడ్ వర్గాలలో చిత్ర బృందం పై వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రేక్షకులలో సినిమాకి పబ్లిసిటీ అయితే దక్కిందని ధీమాగా ఉన్నట్టున్నారు అనార్కలి ఆఫ్ ఆరా టీం.

Similar News