పనిలేకపోయినా నిద్ర రాదు కద బేబీ

Update: 2018-03-16 09:08 GMT

కొంతమంది పూర్తి ఆరోగ్యంగా ఉన్నా రాత్రి పడుకోగానే నిద్ర పట్టదు. అలా కాకుండా కొంతమందికి అనారోగ్య కారణాలవలన నిద్ర పట్టదు. అనారోగ్యం అయితే ఓకె. కానీ ఆరోగ్యంగా వున్నవారికి పడుకోగానే నిద్ర పట్టక పొతే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. మరి అలా ఆరోగ్యంగా ఉండి నిద్ర పట్టని కొంతమంది ఆ రోజు ఏదో ఒక పొరపాటు చెయ్యడం వలెనే అలా నిద్ర పట్టదని... ఒక టాప్ హీరో ఆయన కూతురికి చెప్పేవారట. అయితే ఆ హీరో ఎవరో కాదు కమల్ హాసన్. అలాగే అయన కూతురు శృతి హాసన్ కి నిద్రపట్టకపోతే ఏమైనా పొరపాట్లు చేశామా అని మనకి మనం ప్రశ్నించుకోవాలి..... అసలు ఆ పొరపాటు ఎలా జరిగింది... మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు జరక్కుండా చూసుకోవాలని కమల్, శృతి హాసన్ కి తరుచు చెప్పేవారట.

అందుకే శృతి హాసన్ రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు తానెలాంటి పనులు చేసింది. ఆ పనుల్లో ఏమైనా పొరపాట్లు దొర్లాయా.... అసలు తాను ఇష్టం లేకుండా ఏమైనా పనులు చేసానా.... అలాగే తాను చేసిన పనుల వల్ల ఎవరికైనా నష్టంగాని బాధ గాని కలిగిందా... ఒకవేళ కలిగితే ఇకపై ఎప్పుడూ అలా జరక్కుండా చూసుకోవాలని బలంగా అనుకోవడమే కాదు... ఇకమీదట అలా పాటించేలా ఉండాలని బలంగా అనుకుని మరి నిద్ర పోతుందట. మరి ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతున్న శృతి హాసన్ కి అసలు కంటి మీదకి కునుకెలా వస్తుందో కదా... మరి చేతినిండా పనిలేకపోయినా నిద్ర రాదు కదా బేబీ అని కొంతమంది శృతి చెప్పిన దానికి సెటైర్స్ వేస్తున్నారు.

Similar News