పద్మావతికి మరిన్ని కష్టాలు!!

Update: 2017-11-18 06:00 GMT

దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.... దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం పద్మావతి .రాజ్‌పుత్‌ మహారాణి పద్మావతిగా దీపికా ఈ సినిమాలో కనబడనుంది. రాజ్‌పుత్‌ చరిత్రను భన్సాలీ చరిత్ర ను తప్పుదోవ పట్టించేలా , పద్మావతి పాత్రను నీచంగా చిత్రీకరించాడని రాజపుట్ ప్రజలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే . ఈ ఆందోళనలు ఒక్క రాజస్థాన్ కాకుండా మరి కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించడం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తుంది . .రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్‌ కోట ముఖద్వారం ఎదుట ఆందోళన కారులు బైఠాయించి పర్యాటకులను ఎవ్వరినీ లోపలకు వెళ్లకుండా అడ్డుకొడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసి వచ్చింది.

సెన్సార్ సర్టిఫికేట్....?

అయితే ఇప్పుడు తాజాగా పద్మావతి మరిన్ని చిక్కుల్లోపడింది. అదేమిటంటే సెన్సార్ వారు ఈ చిత్రాన్ని చూడకుండా అప్లికేషన్ అసంపూర్ణంగా వున్నదని దానిని సరిచేసి తిరిగి పంపమని నిర్మాతలకు కబురు పంపించడం మరింత ఆందోళన కలిగించే విషయం. కారణం పద్మావతి సినిమాను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చెయ్యాలని సంజయ లీల భన్సాలీ ఇప్పటికే ప్రకటించాడు . ఈ నేపథ్యంలో సెన్సార్ వారు ఈ రకంగా తిరకాసు పెట్టడం చేస్తుంటే ఇది కావాలనే చేస్తున్నారని ప్రొడక్షన్ హౌస్ కు చెందిన వారు అంటున్నారు . అసలు ఇవన్నీ చూస్తుంటే పద్మావతి సినిమా డిసెంబర్ 1న విడుదలవుతుందా ? కాదా ? అనే అనుమానం వస్తుంది .

Similar News