నోటు దెబ్బ : మొదలైన సినిమా వదిలేసుకున్న హీరో

Update: 2016-11-23 10:50 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు ఓపెనింగ్స్ జరుపుకుని... షూటింగ్ జరుపుకోకుండా ఆగిపోయిన సందర్భాలు చాలానే వున్నాయి. పెద్ద హీరో ల సినిమాలకు కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇక కొన్ని సినిమాలకు డైరెక్టర్ మరియు హీరో, నిర్మాతలు సెట్టైనా కూడా ముహూర్తం వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలు కోకొల్లలు. ఇక ఇప్పుడు అలాగే ఒక సినిమా దాదాపు పూజా కార్యక్రమాలు జరుపుకుని షూటింగ్ మొదలెట్టుకుంటుందనే సమయంలో ఇప్పుడా ప్రాజెక్ట్ అటకెక్కిందని టాక్. ఆ ప్రాజెక్ట్ ఎవరిదో కాదు అ..ఆ సినిమా హిట్ తో మంచి జోరుమీదున్న నితిన్ సినిమా.

నితిన్ అ...ఆ సినిమా హిట్ తర్వాత 14 రీల్స్ బ్యానర్‌లో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నితిన్ ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు. అసలు ఆ సినిమాకి దాదాపు కథ కూడా ఒకే కావడంతో ఇక లొకేషన్స్ కోసం అమెరికా కూడా తిరిగొచ్చింది ఆ సినిమా యూనిట్. కానీ ఇప్పుడు నితిన్ అత్యాశతోనే ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. నితిన్ ఈ సినిమాకి ఏకం గా 5 కోట్లు అడిగాడని అందుకు చిత్ర నిర్మాతలు ఒప్పుకోక పోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ తప్పుకున్నాడని వార్తలొస్తున్నాయి. అసలే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తో అయోమయంలో వున్ననిర్మాతలు ఇలా 5 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చే స్థితిలో లేక కేవలం కోటి రూపాయలు నితిన్ కి ఇస్తామని చెప్పడం తో నితిన్ కోటికి ఒప్పుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు.

ఇక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నితిన్, త్రివిక్రమ్, పవన్ నిర్మించే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతున్నారు.

Similar News