నువ్వు సూపరహే

Update: 2018-02-07 03:35 GMT

గత రెండు ఏడాదిల నుండి టాలీవుడ్ మార్కెట్ అర్ధం కాకుండా వుంది. ఏ సినిమాను ఎంతకీ కొనాలో..ఎంతకీ అమ్మలో తెలియక అటు ప్రొడ్యూసర్స్.. ఇటు బయ్యర్స్ అయోమయం లో వున్నారు. ఈ మధ్య భారీ చిత్రాలు ఎక్కువ రేట్స్ కు కొనడం వలన భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.

ఇలా ఏ సినిమాని ఎంతకీ అమ్మాలి..ఎంతకీ కొనాలి అనేదానిపైన కొందరు హీరోలు స్వయంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో ఒక్కడు రామ్ చరణ్. 'గోవిందుడు అందరివాడేలే' నుంచి ప్రతి సినిమా వ్యాపార లావాదేవీలు చూసుకుంటోన్న చరణ్‌, 'ధృవ'ని కూడా తన మార్కెట్‌ రేట్‌ కంటే తక్కువకే అమ్మేట్టు చూసాడు. ఆలా తక్కువకి అమ్మడం వల్ల చిత్రం సక్సెస్‌ అయింది. మల్లి ఇప్పుడు 'రంగస్థలం' చిత్రానికి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు చరణ్.

తన సొంత సినిమా కాకపోయినా ప్రొడ్యూసర్స్ కి లాభం చేకూర్చాలని తానే స్వయంగా బాధ్యత తీసుకుంటున్నాడట. ఈ చిత్రం రెగ్యులర్ మాస్ సినిమా కాబట్టి.. పెద్ద హీరోస్ చిత్రాలని అమ్మినట్టుగా ఈ చిత్రాన్ని అమ్మకూడదని భావిస్తున్నాడట చరణ్. ఇరవై శాతం తక్కువకే బిజినెస్‌ చేయాలని చరణ్‌ ఆలోచనట. అలానే తనుకు తెలియకుండా ఏ ఏరియా బిజినెస్‌ క్లోజ్‌ చేయరాదని మైత్రి మూవీస్‌ వాళ్లకి చెప్పాడట. దీన్నిబట్టి చూస్తుంటే రంగస్థలంకు యావరేజ్ టాక్ వచ్చిన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

Similar News