నిలకడ లేనందువల్లే ఆ దర్శకుడికి డేట్స్ ఇస్తున్నానంటున్న మెగా స్టార్

Update: 2017-03-15 05:00 GMT

వచ్చే నెల 7 వ తేదీన ప్రపంచ వ్యాపతంగా విడుదల కానున్న బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన సర్కార్ 3 ఇప్పుడు బొంబాయి లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గాడ్ ఫాదర్ సినిమాకి స్ఫూర్తి పొంది తాను చేసే అనేక సినిమాలలో సర్కార్ సిరీస్ కూడా భాగమే అని ఎవరూ అడగక ముందే వాస్తవాలు చెప్పేసే రామ్ గోపాల్ వర్మ నిలకడ లేని తనాన్ని బాలీవుడ్ మీడియా కు చెందిన ఒక విలేకరి అమితాబ్ బచ్చన్ వద్ద ప్రస్తావిస్తూ, మీ కోసం ప్రత్యేకమైన పాత్రలు రూపొందించే దర్శక రచయితలు ఉండగా కూడా మీరు రామ్ గోపాల్ వర్మ కి కాల్ షీట్స్ ఎందుకు ఇస్తుంటారు అని అడిగిన ప్రశ్నకు బిగ్ బి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

"రామ్ గోపాల్ వర్మ నిలకడ లేని వ్యక్తి కాబట్టే రెస్ట్ లెస్ బ్రెయిన్ తో పని చేస్తాడు. ఆయన నిలకడ లేని తనం కారణం గానే ఆయన తెచ్చే ప్రతి పాత్ర పోషించటానికి ఒప్పుకుంటూ వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేస్తుంటాను. ఆయన స్థిరత్వం లేని మనసుతో రాసే కథలో పాత్రలు నా నటనను సవాల్ చేస్తుంటాయి. నాకు ఆ సవాల్ స్వీకరించటం అంటే మహా ఇష్టం. అందుకే వర్మ ఎటువంటి పాత్ర నేరేట్ చేసినా నేను కాదనలేను. నిజానికి ఆయన నిత్యం ఒకటే స్టాండ్ పై ఉంటే ఇన్ని వైవిధ్యమైన, పాత్ బ్రేకింగ్ సినిమాలు చేసి ఉండేవారు కాదేమో. నాకు తెలిసినంత వరకు వర్మ ఇండియన్ సినిమాకి దొరికిన స్టాన్లీ క్యూబ్రిక్. స్టీవెన్ స్పీల్ బర్గ్ మేకింగ్ చూస్తూ ఎంత ఆస్వాదిస్తానో వర్మ సినిమాలను కూడా అలానే ఆస్వాదిస్తాను." అంటూ రామ్ గోపాల్ వర్మ మేకింగ్ తో పాటు వ్యక్తిగత ధోరణిని ఆకాశానికి ఎత్తేసారు బిగ్ బి అమితాబ్ బచ్చన్.

Similar News