నిరాశపరిచిన క్రేజీ కాంబినేషన్ ఫిలిం

Update: 2017-02-13 13:21 GMT

అన్నమయ్య వంటి పాత్ బ్రేకింగ్ సినిమా టాలీవుడ్ కి అందించిన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు-అక్కినేని నాగార్జున ల కాంబినేషన్ తాజగా మరొక భక్తిరస భరితమైన చిత్రం ఓం నమో వెంకటేశాయ కోసం కలిసి పనిచేసిన విషయం విదితమే. రాఘవేంద్ర రావు అన్నమయ్య అనంతరం కూడా ఇదే జోనర్ లో శ్రీ మంజునాథ, శ్రీ రామదాస్, పాండు రంగడు, షిరిడి సాయి, ఇంటింటా అన్నమయ్య చిత్రాలు చేయగా వాటిలో ఇంటింటా అన్నమయ్య విడుదలకి నోచుకోలేదు. అయితే శ్రీ రామదాస్ మోస్తరు ఫలితం తప్ప మిగిలిన చిత్రాలు ఆశాజనకమైన బిజినెస్ చేయలేకపోయాయి. ఇక తాజాగా విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్రం అన్నమయ్య తరువాత వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాగార్జున నటించిన చిత్రం పైగా అన్నమయ్య కాంబినేషన్ కావటంతో భారీ అంచనాల మధ్య విడుదల ఐయ్యింది.

శుక్రవారం(10 ఫిబ్రవరి) న ఓం నమో వెంకటేశాయ విడుదల రోజే మెగా స్టార్ చిరంజీవి వంటి పలువురు సినిమా ప్రముఖులకు ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసి చూపగా, మెగా స్టార్ చిరంజీవి సినిమా వీక్షించిన అనంతరం ఇది ఒక దివ్యానుభూతి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సినిమా ప్రముఖులందరూ నాగార్జున తప్ప మరొకరిని ఈ పాత్రలో ఊహించుకోలేమని తెలిపారు. సినిమా స్టార్స్ అందరూ ఇంతటి పాజిటివ్ బజ్ తీసుకు వచ్చినప్పటికీ ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని ప్రేక్షకులు స్వాగతించలేదు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి భారీ విజయాల అనంతరం విడుదలైన నాగార్జున సినిమా తొలి రోజు కేవలం రెండున్నర్ర కోట్ల రూపాయల వసూళ్లతో చిన్న హీరో స్థాయి ఓపెనింగ్స్ కూడా తీసుకోలేకపోయింది. కాగా మిక్స్డ్ టాక్ తో ప్రదర్శితమవుతున్న ఓం నమో వెంకటేశాయ చిత్రానికి రెండవ రోజు కూడా థియేటర్స్ లో హాఫ్ ఆక్యుపెన్సీ కరువవటం పంపిణీదారులు కలవర పెడుతోంది.

Similar News