నితిన్ ఫుల్ హ్యాపీ భయ్యా!!

మూడు సినిమాల తర్వాత తగిలిన హిట్ ని హీరో నితిన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భీష్మ హిట్ కొట్టాక నితిన్ కాన్ఫిడేంట్ బాగా పెరిగింది. అందులోను  భారీ [more]

Update: 2020-02-24 11:38 GMT

మూడు సినిమాల తర్వాత తగిలిన హిట్ ని హీరో నితిన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భీష్మ హిట్ కొట్టాక నితిన్ కాన్ఫిడేంట్ బాగా పెరిగింది. అందులోను భారీ హిట్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నాడు. కెరీర్ లో హిట్, లైఫ్ లో హిట్ అన్నట్టుగా ఉంది నితిన్ పరిస్థితి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దూసుకుపోతున్న భీష్మ ఓవర్సీస్ లోను అద్భుతమైన హిట్ దిశగా సాగుతుంది. పండగ తర్వాత ఆయమన్న సినిమాలేక బోర్ కట్టిన ప్రేక్షకులకు.. భీష్మ సినిమా ఎడారిలో ఎండమావిలా తగలడంతో. ఇటు తెలుగు ప్రేక్షకులు, అటు ఓవర్సీస్ ప్రేక్షకులు భీష్మ ని భీబత్సంగా చూసేస్తున్నారు.

అలా వైకుంఠపురములో హిట్ తర్వాత ఓవర్సీస్ ప్రేక్షకులు ఉసూరుమంటుంటే.. భీష్మ వాళ్ళకి కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక అ… ఆ.. తర్వాత మళ్ళీ నితిన్ భీష్మ తో చెలరేగిపోయాడు. అయితే భీష్మ సినిమాకు మంచి టాకే వ‌చ్చినా.. ఇలాంటి ఫార్ములా సినిమాల్ని ఓవర్సీస్ ఆడియ‌న్స్ ఏమాత్రం ప‌ట్టించుకుంటారో అనే అనుమానం మొదలయ్యింది. కానీ భీష్మ మాత్రం ఓవర్సీస్ ప్రేక్షకులను అనుమాలన్నీ ప‌టాపంచ‌లు చేసింది. శుక్ర, శ‌నివారానికే హాఫ్ మిలియ‌న్ మార్కుకు చేరువై అక్కడ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఆదివారం నుండి వచ్చే కలెక్షన్స్ అన్ని…. బయ్యర్లకు లాభాలే అన్నమాట. సో నితిన్ అలా హ్యాపీగా ఉన్నాడన్నమాట.

Tags:    

Similar News